తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. నెట్టింట వీడియో వైరల్
సాధారణంగా మానవులు తమ కోర్కెలు నెరవేర్చమని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇటీవల పశుపక్ష్యాదులు కూడా దైవాన్ని వేడుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కుక్కలు, కోతులు దేవాలయాల్లోకి ప్రవేశించి తమ గోడును దేవునికి వినిపిస్తూ ప్రదక్షిణలు చేసిన ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా ఓ ఆవు వేంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఏలూరు జిల్లా నిడమర్రులో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో మార్చి 24వ తేదీ సోమవారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. వేకువజామునే ఓ ఆవు ఆలయానికి వచ్చింది. రావడంతోనే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అనంతరం ఆలయం ప్రధాన ద్వారం ముందు నిల్చొంది. ఆ స్వామివారికి ఏమి విన్నవించుకుందో కానీ… అలా చాలాసేపు స్వామివారిని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆలయ పూజారి స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసేందుకు రావడంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆలయ ద్వారం ముందు నిల్చున్న ఆవును చూసి పూజారి ఆశ్చర్యపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్ ??
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. భర్త ఏం చేసాడంటే ?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
పరగడుపున.. ఈ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో దాన్ని అలా కొరికేసిందేంటి !!