పుచ్చకాయల్ని తిన్నాక.. ఈ పదార్థాలు తిన్నారు అంటే.. మీ పని అవుట్ అంతే..
Phani CH
01 April 2025
Credit: Instagram
పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది.. అందువల్ల సమ్మర్ సీజన్ లో తరచుగా తింటే శరీరానికి మంచిదని డాక్టర్లు చెప్తారు.
పుచ్చకాయను ఎప్పటి కప్పుడు ఫ్రెష్ గా కట్ చేసుకుని తింటు ఉండాలి. కొన్నిగంటలు అలానే ఉంచి తింటే బ్యాక్టిరియాలు పెరిగిన తరువాత తింటే అలర్జీలు , జీర్ణవ్యవస్థ సమస్యలు ఏర్పడతాయి.
కొంత మంది పుచ్చకాయ పై మసాలాలను చల్లుకుని తింటారు. దీని వల్ల కూడా కడుపులో వికారంగా అవుతుంది. ఇది శరీరంపై అలర్జీలకు కారణమౌతుంది.
పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగితే గ్యాస్ లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలో నీరు, పాలలో ప్రోటీన్ రెండూ కలిస్తే జీర్ణం కష్టమవుతుంది.
పుచ్చకాయ తిన్న వెంటనే మాంసం తినకూడదు.. ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. పుచ్చకాయ త్వరగా జీర్ణమవుతుంది, ఇవి కలిస్తే కడుపు ఉబ్బరం రావచ్చు.
పెరుగు చల్లదనం కలిగి ఉంటుంది, కానీ పుచ్చకాయతో కలిస్తే శరీరంలో తేమ పెరిగి జలుబు లేదా దగ్గు వచ్చే ప్రమాదం ఉంది.
నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను వెంటనే తినకూడదు. రెండింటి లో ఆమ్ల గుణాలు కలిస్తే కడుపులో మంట లేదా గ్యాస్ ఏర్పడవచ్చు.
పుచ్చకాయ తిన్నాక కనీసం 30-60 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇతర ఆహారాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణుల చెప్తున్నారు.