ప్రపంచానికి ముప్పు.. వేగంగా కరుగుతున్న గ్లేసియర్లు వీడియో
పారిశ్రామికీకరణకు గ్లోబల్ వార్మింగ్ తదితరాలు తోడై గ్లేసియర్ల ఉసురు తీస్తున్నాయి. ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమ్మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి. ఫలితంగా 1976 నుంచి 8,200 గిగా టన్నుల మంచు మాయమైపోయినట్టు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం (సీ3ఎస్) తేల్చింది.
‘‘కేవలం 2000 నుంచి 2023 మధ్యే ఏకంగా 6,000 గిగాటన్నులు ఐస్ ఆవిరైపోయిందనీ 2010 నుంచి ఈ ధోరణి మరీ వేగం పుంజుకుందనీ చెబుతోంది. ఏటా 370 గిగాటన్నుల చొప్పున మంచు కరిగిపోతోందని మానవాళిని హెచ్చరించింది. అందుకే ఈ ఏడాది గ్లేసియర్ల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఐక్యరాజ్యసమితి కూడా పిలుపునిచ్చింది. గత 50 ఏళ్లలో గ్లేసియర్లు అతి ప్రమాదకర స్థాయిలో కరిగిపోతున్న ప్రాంతాల్లో కెనడా, అమెరికా, మధ్య యూరప్ టాప్‌లో ఉన్నాయి. ఆసియాతో పాటు రష్యా, కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా, అంటార్కిటికాలో ఇంకా తక్కువగా ఉంది. ప్రపంచ వాటర్ డే సందర్భంగా సీ3ఎస్ గణాంకాలను వెల్లడించింది. ఆర్క్‌టిక్ నుంచి హిమాలయాల దాకా ప్రపంచవ్యాప్తంగా గ్లేసియర్ల ఉనికి నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోందని హెచ్చరించింది.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో