- Telugu News Photo Gallery Cinema photos Is Salman Khan teaming up with Harish Shankar know the details here
Harish Shankar: ఆ సూపర్ స్టార్‌తో హరీష్ శంకర్.. ఉస్తాద్ లేనట్లేనా..?
థింక్ బిగ్ అంటారు కదా..? చేసే ఆలోచన ఏదో చిన్నగా ఎందుకు.. ఒకేసారి కుంభస్థలాన్ని బద్ధలు కొట్టేలా చేస్తే అయిపోతుంది. ప్రస్తుతం మన దర్శకులు చేస్తున్నది ఇదే. ఎలాగూ బాలీవుడ్ వెళ్లాలని ఫిక్సైనపుడు.. చిన్నోళ్లతో ఎందుకు కొడితే కుంభస్థలమే అంటున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్స్, బాలీవుడ్ స్టార్స్ కాంబోకి డిమాండ్ బాగా ఉంది. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Apr 01, 2025 | 9:54 PM

ఓ వైపు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లైన్‌లోనే ఉండగానే.. వరసగా వేరే సినిమాలు చేస్తూనే ఉన్నారు హరీష్ శంకర్. పవర్ స్టార్ ఉన్న బిజీకి ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే.

అలాగని లేదని కాదు.. కచ్చితంగా ఉంటుందని చెప్పారు మైత్రి మూవీ మేకర్స్. ఈలోపు అదే బ్యానర్‌లో మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమవుతున్నారు హరీష్ శంకర్. సల్మాన్ ఖాన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్యే భాయ్‌ను కలిసి స్టోరీ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. తాజాగా సల్మాన్, హరీష్, మైత్రి నవీన్ ఫోటో సోషల్ మీడియా అంతా తిరుగుతుంది. ఇక వారసుడు తర్వాత మరో సినిమా చేయని వంశీ పైడిపల్లి.. నెక్ట్స్ ఏకంగా అమీర్ ఖాన్‌తోనే మూవీ ప్లాన్ చేస్తున్నారు.

కెరీర్ అంతా స్టార్ హీరోలతోనే పని చేస్తూ వస్తున్నారు వంశీ పైడిపల్లి. ఈసారి బాలీవుడ్‌పై ఫోకస్ చేసి.. అక్కడ అమీర్‌కు కథ చెప్పారీయన. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ రానుంది. ఇక సన్నీ డియోల్ జాట్ సినిమాతో ఇప్పటికే నార్త్‌ను షేక్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. విడుదలకు ముందే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

జాట్‌లో సన్నీ డియోల్‌ను ప్రజెంట్ చేసిన తీరు నచ్చి.. రిలీజ్‌కు ముందే బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు గోపీచంద్. హనుమాన్ తర్వాత రణ్‌వీర్ సింగ్‌తో బ్రహ్మ రాక్షస్ సినిమా ప్లాన్ చేసారు ప్రశాంత్ వర్మ.. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇక యానిమల్ సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేసారు సందీప్ వంగా. మొత్తానికి మన దర్శకులు హిందీలో సంచలనాలు రేపుతున్నారు.





























