- Telugu News Photo Gallery Cinema photos Ugadi movies like mad square lucifer 2 robinhood know which one is winner
ఉగాది విన్నర్ గా గెలిచింది ఎవరు.. ఓడింది ఎవరు ??
ఉగాదికి సౌత్‌లోనే నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.. మరి వాటిలో ఏది రేసులో ముందుంది..? వీకెండ్ అయ్యేనాటికి ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంది..? దేనికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి..? ఏది బాక్సాఫీస్ దగ్గర ఏ ఇంపాక్ట్ చూపించకుండా అలా ఉండిపోయింది..? ఉగాది సినిమాల రిజల్ట్‌పై స్పెషల్ స్టోరీ.. ఉగాది సినిమాల్లో ఊహించినట్లుగానే మ్యాడ్ స్క్వేర్ రేసులో ముందుంది.
Updated on: Apr 01, 2025 | 9:33 PM

ఉగాది సినిమాల్లో ఊహించినట్లుగానే మ్యాడ్ స్క్వేర్ రేసులో ముందుంది. ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే తీసుకొస్తుంది. కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మ్యాడ్ కుర్రాళ్లు.

క్రేజీ సీక్వెల్ కావడం.. ఎంటర్‌టైన్మెంట్‌కు ఢోకా లేకపోవడంతో వీకెండ్ కుమ్మేసింది మ్యాడ్ స్క్వేర్. ఈ దూకుడు చూస్తుంటే.. 100 కోట్ల క్లబ్బులో చేరేలా కనిపిస్తుంది.

మ్యాడ్ స్క్వేర్2తో పాటే విడుదలైన రాబిన్ హుడ్‌కు మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రావట్లేదు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రమోషన్స్ చాలానే చేసారు.

కానీ అవి కలెక్షన్స్ రూపంలో కనబడలేదు. రొటీన్ కంటెంట్ కావడంతో.. రాబిన్ హుడ్ వైపు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించట్లేదు.. బాక్సాఫీస్ దగ్గర ఇది నిలబడాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే.. విక్రమ్ హీరోగా వచ్చిన వీర ధీర సూరన్ సినిమాకు టాక్ బాగానే ఉన్నా.. వసూళ్లు పెద్దగా కనిపించట్లేదు. లూసీఫర్ 2 తెలుగులో ప్రభావం చూపించట్లేదు గానీ వరల్డ్ వైడ్‌గా 175 కోట్ల మార్క్ అందుకుంది. పైగా వివాదాలు ఈ సినిమాకు హెల్ప్ అవుతున్నాయి. మొత్తానికి ఈ పండగ సినిమాల్లో మ్యాడ్ స్క్వేర్ యునానిమస్ విన్నర్‌గా నిలిచింది.




