AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో బీభత్సం.. కట్‌చేస్తే.. హగ్‌తో ఆకాశానికెత్తిన ప్రీతిజింటా

Prabhsimran Singh Hits Fastest IPL Fifty in Lucknow: పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన తుఫాను ఇన్నింగ్స్‌తో లక్నో బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కేవలం 34 బంతుల్లో 202 స్ట్రైక్ రేట్‌తో 69 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో లగాన్ సినిమాను గుర్తు చేశాడు ఈ యంగ్ ప్లేయర్.

IPL 2025: 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో బీభత్సం.. కట్‌చేస్తే.. హగ్‌తో ఆకాశానికెత్తిన ప్రీతిజింటా
Prabhsimran Singh
Venkata Chari
|

Updated on: Apr 01, 2025 | 11:38 PM

Share

Prabhsimran Singh Hits Fastest IPL Fifty in Lucknow: ఐపీఎల్ (IPL) 2025 లో భాగంగా 13వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీం 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో లక్నో బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. అతను కేవలం 34 బంతుల్లో 202 స్ట్రైక్ రేట్‌తో 69 పరుగులు చేశాడు. ఈ సమయంలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఒక ఫోర్ కొట్టడం అందరికీ లగాన్ సినిమాను గుర్తు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మాత్రమే కాదు, ఈ ఇన్నింగ్స్‌లో, ప్రభ్‌సిమ్రాన్ లక్నోలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డును కూడా సృష్టించాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతిజింటా నుంచి ఓ హగ్ కూడా అందుకున్నాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

లక్నోలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ..

పంజాబ్ కింగ్స్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మొదటి ఓవర్లోనే 1 ఫోర్, 1 సిక్స్ కొట్టడం ద్వారా తన వైఖరి ఏంటో చూపించాడు. ఆ తరువాత ఏమాత్రం ఆగలేదు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ విధంగా అతను కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో అతను లక్నో మైదానంలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డును కూడా సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఎకానా స్టేడియంలో 27 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సునీల్ నరైన్ పేరిట ఉంది. హాఫ్ సెంచరీ తర్వాత కూడా ప్రభ్‌సిమ్రాన్ ఆగలేదు. కానీ, 11వ ఓవర్‌లో 69 పరుగులు చేసిన తర్వాత దిగ్వేష్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఇవి కూడా చదవండి

లగాన్ సినిమా నుంచి ఓ షాట్..

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రాన్ 3 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టాడు. వాటిలో అచ్చం లగాన్ సినిమాలో లాగా ఒక ఫోర్ ఉండడం గమనార్హం. నిజానికి, 8వ ఓవర్లో అతను రవి బిష్ణోయ్ వేసిన బంతికి ఆఫ్ స్టంప్ వైపు షఫుల్ అయ్యాడు. ఆ తర్వాత బిష్ణోయ్ అదే లైన్‌లో ఫుల్ టాస్ వేశాడు. దానిపై ప్రభ్‌సిమ్రాన్ సులభంగా స్కూప్ షాట్ ఆడి ఫోర్ కొట్టాడు. ఈ షాట్ లగాన్ సినిమా లాగానే ఉంది. వ్యాఖ్యాతలు కూడా దీనిని ప్రస్తావించారు.

ప్రీతి జింటా హగ్..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ తరపున ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అతిపెద్ద హీరోగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ జట్టు విజయాన్ని ఎంతో ఈజీ చేసింది. 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 98 బంతుల్లోనే ఛేదించింది. అయితే, ఇదంతా ప్రీతి జింటా ఆత్మవిశ్వాసం ఫలితమే. అయితే, జట్టు ఓనర్ ప్రీతి జింటా మాత్రం అతనిపై నమ్మకం వ్యక్తం చేసి వరుసగా 6 సీజన్ల పాటు అతనిని జట్టులో ఉంచింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ దిగ్గజాలను విడుదల చేసింది. కానీ, ప్రీతి జింటా అతన్ని రూ. 4 కోట్ల ధరకు రిటైన్ చేసుకుంది. నేడు ప్రభ్‌సిమ్రాన్ ఆమె నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో ప్రీతిజింటా హగ్‌తో విషెస్ తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..