అసలే సమ్మర్..చల్లచల్లగా ఫ్రిజ్ నీరు కాదండోయ్.. మట్టికుండలోని నీటితో బోలేడు ప్రయోజనాలు!
samatha
1 april 2025
Credit: Instagram
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి నీరు తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
మరీ ముఖ్యంగా ఎక్కువగా ఫ్రిజ్‌లో వాటర్ తాగుతుంటారు. కానీ ఇలా ఫ్రిజ్ లో వాటర్ తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉంది.
అందువలన ఎండాకాలంలో మట్టికుండలోని నీరుతాగాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.
కాగా, సమ్మర్‌లో మట్టికుండలో నీరు తాగడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం.
మట్టికుండలో నీరు సహజంగానే చల్లగా ఉండటం వలన వాటి రుచి బాగుంటుందంట. అలాగే వీటిని తాగడం వలన గ్
యాస్, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే మట్టికుండలోని నీరు తాగడం వలన శ్వాస కోశ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుదంట. ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు.
ఇక సమ్మర్‌లో చాలా మంది డీ హైడ్రేషన్ బారిన పడుతుంటారు. అలాంటి వారు మట్టికుండలోని నీరు తాగడం వలన ఆ సమస్య నుంచి మీరు బయట
పడవచ్చు.
వడదెబ్బ తగిలిన వారికి మట్టికుండ నీరు దివ్వఔషధంగా పనిచేస్తాయంట. దీని వలన జీర్ణక్రియ కూడా బాగుంటుందని చెప్తున్నారు వైద్యులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వామ్మో.. ఫ్రిజ్ లోపెట్టిన పుచ్చకాయ తింటున్నారా.. ఇక కథ కంచికే!
అత్యంత తెలివైన వ్యక్తులకు ఉండే ఐదు మంచి అలవాట్లు ఇవే!
నలభైలో యవ్వనంగా ఉండాలంటే,ఇరవైలో చేయాల్సిన పనులు ఇవే!