వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే..చర్మం యవ్వనంతో మెరుస్తుంది వీడియో
ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దీనికోసం రకరకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా సహజంగానే చర్మసౌందర్యాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం మృదువుదనం కోల్పోయి ముడతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొల్లాజెన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్యలను అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.
కొల్లాజెన్ అనేది చర్మాన్ని గట్టిగా, మృదువుగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్. కొల్లాజెన్ స్థాయిని పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం మటన్ ఎముకల నుంచి తయారయ్యే బోన్ సూప్ కొల్లాజెన్‌ను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించి, దృఢంగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు, ప్రోటీన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ కొంత మోతాదులో బోన్ సూప్ తీసుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను నివారిస్తాయి. ఇవి రోజూ తింటే చర్మానికి తగినంత పోషకాలు అందుతాయి.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో
అమీర్‌ఖాన్ కుమార్తెకు ఏమైంది?వీడియో