Star Fruit: డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!

స్టార్ ఫ్రూట్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంటి వద్ద కూడా మొక్కలు తెచ్చుకుని మరీ పెంచుకుంటున్నారు. ఇవి జామ కాయ రుచిని కలిగి ఉంటాయి. కానీ పెద్దగా తియ్యగా ఉండవు. కాస్త పుల్లగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల ఎన్నో సమస్యలను అదుపులో చేసుకోవచ్చు..

Star Fruit: డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
Star Fruit
Follow us
Chinni Enni

|

Updated on: Jan 03, 2025 | 2:32 PM

స్ట్రార్ ఫ్రూట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది. ఇంటి దగ్గర కూడా ఈ స్టార్ ఫ్రూట్ మొక్కలను పెంచుకుంటున్నారు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ కాయల ఆకృతిని బట్టి వీటిని స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇవి పచ్చ రంగులో ఉంటాయి. రుచికి మాత్రం కాస్త పుల్లగా ఉంటాయి. వీటిని ఎక్కువగా దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు. ఈ పండ్లలో అనేక రకాల పోషకాలు లదభిస్తాయి. విటమిన్లు సి, బి2, బి9, బి6, ఫైబర్, జింక్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం వంటివి లభిస్తాయి. వీటిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయి. మరి స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్:

స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి శరీరంలో పేరుకు పోయిన కొవ్వును, మలిన పదార్థాలను బయటకు పంపించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడేవారు తరచుగా స్టార్ ఫ్రూట్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

రోగ నిరోధక శక్తి మెండు:

ఈ స్టార్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. ఇమ్యూనిటీ పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు త్వరగా ఎటాక్ చేయకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

స్టార్ ఫ్రూట్ తింటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ బరువును కంట్రోల్ చేసి, ఆకలిని నియంత్రణ చేస్తాయి. తరచూ ఈ పండు తింటే బరువు అనేది తగ్గుతుంది.

డయాబెటీస్ కంట్రోల్:

డయాబెటీస్ ఉన్నవారు స్టార్ ఫ్రూట్ తినడం మంచిదే. ఇది పుల్లగా ఉంటుంది. ఇందులో షుగర్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ప్రతి రోజూ ఒక పండు తిన్నా సరిపోతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్.. గ్లామర్ ప్రపంచానికి యువరాణి..
హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్.. గ్లామర్ ప్రపంచానికి యువరాణి..
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌
ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌
భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్
భార్యతో విడాకుల రూమర్లు.. మద్యం మత్తులో చాహల్! వీడియో వైరల్
24 వికెట్లు పడగొట్టి రచ్చ లేపిన మాజీ క్రికెటర్ తనయుడు
24 వికెట్లు పడగొట్టి రచ్చ లేపిన మాజీ క్రికెటర్ తనయుడు
మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు
మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు
మీ ల్యాప్‌టాప్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? హ్యాక్ అయినట్లే..!
మీ ల్యాప్‌టాప్‌లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? హ్యాక్ అయినట్లే..!
మెంటల్ ఎక్కే ఫీచర్లతో మరో సూపర్ కారు రిలీజ్ చేసిన కియా..!
మెంటల్ ఎక్కే ఫీచర్లతో మరో సూపర్ కారు రిలీజ్ చేసిన కియా..!
స్ట్రెస్ బాల్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..? నిపుణులు చెబుతున్నది
స్ట్రెస్ బాల్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా..? నిపుణులు చెబుతున్నది
పూనమ్ ట్వీట్‌కు 'మా' రియాక్షన్
పూనమ్ ట్వీట్‌కు 'మా' రియాక్షన్
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?