Kia Syros: మెంటల్ ఎక్కే ఫీచర్లతో మరో సూపర్ కారు రిలీజ్ చేసిన కియా.. బుకింగ్స్ ఓపెన్..!
ప్రముఖ కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా తాజాగా తన లైనప్‌లో మరో సూపర్ కారును చేర్చింది. కియా సిరోస్ పేరుతో లాంచ్ చేసిన ఈ కారు బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వినియోగదారులకు మరింత ప్రీమియం అనుభవాన్ని అందించే అనేక ఫీచర్లతో ఉన్న కియా సిరోస్‌ను కొత్త సబ్-కాంపాక్ట్ మోడల్ ఎస్‌యూవీగా డిసెంబర్ 19న భారతదేశంలో లాంచ్ చేసింది.
భారతదేశంలో కియా సిరోస్ లాంచ్ తన ఎస్‌యూవీ లైనప్‌లో సోనెట్, సెల్టోస్ వంటి వాటి సరసన సిరోస్ కూడా చేరింది. ఈ కారు ముఖ్యంగా టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి పోటీగా లాంచ్ చేశారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కియా సిరోస్‌ను రూ.25,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. భారతదేశంలోని కియా షోరూమ్స్‌తో పాటు కియా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ కారు బుకింగ్ చేయవచ్చు. ఈ కారు ధర ఫిబ్రవరి 1న ధరలు వెల్లడిస్తారు. అలాగే మార్చి నెల నుంచి సిరోస్ ఎస్‌యూవీల డెలివరీని ప్రారంభించనుంది.
సిరోస్ ఎస్‌యూవీ ధర భారత మార్కెట్‌లో రూ. 10 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. కియా సిరోస్ ఎస్‌యూవీ ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిలో హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్, హెచ్‌టీఎక్స్ ప్లస్ ఆప్షనల్, హెచ్‌టీకే, హెచ్‌టీకే ఆప్షనల్, హెచ్‌టీకే ప్లస్ వేరియంట్స్‌లో వినియోగదారులు ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ ఎస్‌యూవీ ఎనిమిది సింగిల్ టోన్ ఎక్స్‌టర్నల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. సిరోస్ కారు లాంచ్ సమయంలో ఫ్రాస్ట్ బ్లూ థీమ్‌తో లాంచ్ చేశారు. కియా సిరోస్ ఇంటీరియర్ బ్లాక్, గ్రే డ్యూయల్-టోన్ థీమ్‌తో మట్టే ఆరెంజ్ యాక్సెంట్లతో వస్తుందని తెలుస్తుంది. కియా సిరోస్ కారు 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్-స్క్రీన్ సెటప్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు.
కియా సిరోస్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ముందు, వెనుక వరుసల్లో వెంటిలేటెడ్ సీట్లు, స్లైడింగ్, రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, వైర్ లెస్ ఛార్జర్, ట్విన్ యూఎస్‌బీ పోర్ట్‌లతో ఈ కారును లాంచ్ చేశారు. ఈ ఎస్‌యూవీ కారు డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో రావడంతో యువతను అమితంగా ఆకర్షిస్తుంది. భద్రత పరంగా కూడా కియా అనేక ఫీచర్లతో సిరోస్‌ున ప్యాక్ చేసింది. లేన్ కీప్ అసిస్ట్‌లతో సహా 16 అధునాతన అనుకూల లక్షణాలతో 2వ ఏడీఏఎస్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
ఈ ఎస్‌యూవీ హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగ్లు, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కూడా అందిస్తుంది. ఈ కారు 1.0 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ సి-118 బీహెచ్‌పీ పవర్, 172 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 116 బీహెచ్‌పీ పవర్, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తాయి. పెట్రోల్ ఇంజన్ కూడా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్‌తో వస్తుంది. డీజిల్ యూనిట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌గా వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి