OYO Rooms: పెళ్లి కాని జంటలకు ఇకపై నో రూమ్.. ఓయో సంచలన నిర్ణయం..

ఓయో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు రూల్ మారింది.. ఇకపై ఎవరికి పడితే వారికి రూమ్ బుకింగ్స్ కుదరదంటూ ఓయో తేల్చిచెప్పింది.. పెళ్లికాని జంటలకు ఇకపై రూమ్ బుకింగ్ లేదంటూ దిగ్గజ ట్రావెల్‌ బుకింగ్‌ సంస్థ ఓయో షాక్​ ఇచ్చింది.. వారికి ఇకపై నో ఎంట్రీ అంటూ తేల్చిచెప్పింది.

OYO Rooms: పెళ్లి కాని జంటలకు ఇకపై నో రూమ్.. ఓయో సంచలన నిర్ణయం..
Oyo Hotels
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 05, 2025 | 1:29 PM

ఓయో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు రూల్ మారింది.. ఇకపై ఎవరికి పడితే వారికి రూమ్ బుకింగ్స్ కుదరదంటూ ఓయో తేల్చిచెప్పింది.. పెళ్లికాని జంటలకు ఇకపై రూమ్ బుకింగ్ లేదంటూ దిగ్గజ ట్రావెల్‌ బుకింగ్‌ సంస్థ ఓయో షాక్​ ఇచ్చింది.. ఈ మేరకు చెక్‌-ఇన్‌ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇకపై పెళ్లి కాని యువతీ యువకులను ఓయో హోటల్స్​లో చెక్​ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్​షిప్​నకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఫ్రూఫ్​ (ఐడీ కార్డులు లేదా ఫొటో ప్రూఫ్) అడగనుంది. ఇలాంటి ఫ్రూఫ్​ లేకపోతే- స్థానిక సామాజిక సెన్సిబిలిటీకి అనుగుణంగా, బుకింగ్స్​ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్​ హోటళ్లకు ఇస్తున్నట్లు ఓయో చెప్పింది.

ట్రావెల్ బుకింగ్ సంస్థ OYO భాగస్వామి హోటల్‌ల కోసం కొత్త చెక్-ఇన్ పాలసీని మీరట్ నుంచి ప్రారంభించింది.. మీరట్‌లోని తన భాగస్వామ్య హోటళ్లకు దీన్ని తక్షణమే అమలులోకి తీసుకురావాలని నిర్దేశించింది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించనుందని.. పాలసీ మార్పు గురించి తెలిసిన వ్యక్తులు చెప్పారు. సురక్షిత, బాధ్యతాయుతమైన పద్ధతులకు కట్టుబడి ఉన్నట్లు ఓయో వివరించింది. OYO ఈ సమస్యను పరిష్కరించడానికి మీరట్‌లోని పౌర సమాజ సమూహాల నుంచి గతంలో అభిప్రాయాన్ని స్వీకరించింది. అదనంగా, కొన్ని ఇతర నగరాల నివాసితులు పెళ్లికాని జంటలను OYO హోటల్‌లలో చెక్-ఇన్ చేయడానికి అనుమతించకూడదని చాలా మంది చెప్పారని తెలిపింది.

OYO నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ మాట్లాడుతూ.. “OYO సురక్షితమైన – బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను సమర్ధించటానికి కట్టుబడి ఉంది. తాము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తున్నామని.. అలాగే చట్ట అమలు, పౌరులతో కలిసి పని చేయడం, వినడం మా బాధ్యతగా గుర్తించామన్నారు.. అయితే ఇదే శాశ్వత విధానం కాదని, కాలానుగుణంగా చెక్‌ ఇన్‌ పాలసీని మార్చివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారులు, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన అనుభవాన్ని కలిగించేలా తమకు తాము చూపించుకునే చొరవలో ఇదీ ఒకటంటూ వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఓయో.. అతిథులు ఎక్కువ సమయం హోటల్​లో ఉండేలా ప్రోత్సహించడం, రిపీట్​ బుకింగ్‌లు, కస్టమర్లకు కంపెనీపై నమ్మకం పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.. అంతేకాకుండా పోలీసులు, హోటల్​ భాగస్వాములతో సురక్షితమైన ఆతిథ్యంపై జాయింట్​ సెమినార్​లు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్​లిస్ట్​ చేయడం, అనధికారికంగా ఓయో బ్రాండింగ్ ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఓయో సంస్థ వెల్లడించింది.