Moto G05: మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు.. వారే అసలు టార్గెట్..!

భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువ. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకు అనుగుణంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా మరో రెండు రోజుల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

Moto G05: మరో రెండు రోజుల్లో నయా ఫోన్ రిలీజ్ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు.. వారే అసలు టార్గెట్..!
Moto G05
Follow us
Srinu

|

Updated on: Jan 05, 2025 | 3:45 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 05ని జనవరి 7న భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పేరుకే బడ్జెట్ ఫోన్ అయినా మోటో జీ 05లో రూ. 25,000 ధరల్లో ఉండే ఫోన్స్ ఫీచర్లను మోటో అందిస్తుంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్ కీలక స్పెసిఫికేషన్‌లు, డిజైన్ వివరాలను ధ్రువీకరించింది. ఈ ఫోన్ ఎంఐకు ఫోన్లు అయిన రెడ్‌మీ ఏ, సీ సిరీస్ ఫోన్లకు గట్టి పోటినిస్తుంది. మోటో జీ 04 ఫోన్ రూ. 6,999 వద్ద అందుబాటులో ఉంచగా, ఆ ఫోన్ సక్సెసర్‌ మోడల్‌గా మోటో జీ 05ను రూ. 10,000 లోపు లాంచ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్‌లో  1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 90 హెచ్‌జెడ్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ సౌండ్, వేగన్ లెదర్ ఫినిషింగ్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

వాటర్ టచ్ టెక్నాలజీ, సరికొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుందని నిపుణులు చెబుతన్నారు. ఐపీ 52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ వంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో కనిపిస్ంచే ఈ ఫీచర్లు మోటో జీ 05లో అందిస్తున్నారు. మోటో జీ 05 ప్రత్యేకించి డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, చిప్‌సెట్‌లో ఆకట్టుకునేలా రూపొందించారు. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లే తో వస్తుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రీమియం ఫోన్స్‌లో కనిపించే లెదర్ బ్యాక్ ప్యానెల్‌ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రెడ్ కలర్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అధునాతన కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ + 64జీబీతో వస్తుంది. 

మోటో జీ 05లో మీడియాటెక్ హీలియో జీ 81 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్‌కు శక్తినిస్తుంది. కెమెరా సెటప్‌లో 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్‌లో డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియోకు కూడా మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి