Tollywood: సామాన్య భక్తురాలిలా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఏడు కొండల వాడు కొలువైన తిరుమల శ్రీవారి క్షేత్రానికి ప్రతిరోజూ ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వీరిలో సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఉంటారు. అలా ఆదివారం ( జనవరి 05) కూడా ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీవారి సేవలో పాల్గొంది.

Tollywood: సామాన్య భక్తురాలిలా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2025 | 3:05 PM

సాధారణంగా సినిమా సెలబ్రిటలు తిరుమలకు వస్తే హంగామా, హడావిడి ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనానికి వచ్చినా భక్తులు వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. ఇది తిరుమలలో నిత్యం జరిగేదే. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం సింపుల్ గా శ్రీవారిని దర్శనం చేసుకుని వెళ్లిపోతుంటారు. తమ ముఖం భక్తులకు, సాధారణ జనాలకు కనిపించకుండా దుపట్టా లేదా మాస్కులతో కవర్ చేసుకుంటుంటారు. అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ క్రేజీ హీరోయిన్ సింపుల్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా ఓ సామాన్య భక్తురాలిలా ఏడు కొండలవాడి సేవలో పాల్గొంది. ముఖానికి మాస్క్ ధరించడంతో భక్తులు కూడా ఈ హీరోయిన్ ను గుర్తు పట్టలేకపోయారు. పై ఫొటోలో ఉన్నది ఆమెనే. మరి ఈ టాలీవుడ్ అందాల తార ఎవరో గుర్తు పట్టారా? ప్రస్తుతం టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే ఈ బ్యూటీ పేరే వినిపిస్తుంది. గతేడాది ఆమె నటించిన అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. ఈ సంక్రాంతికి మరో సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన సినిమా రిలీజ్ కు ముందు ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ బ్యూటీ మరెవరో కాదు మీనాక్షి చౌదరి.

ఇవి కూడా చదవండి

ఈ సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తిరుమలలో మీనాక్షి చౌదరి.. వీడియో..

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.