AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా పండిస్తారో తెలుసా..?

సాధారణంగా కూరగాయల ధరలు అంటే 100 లోపు లేదా ఆపై మాత్రమే ఉంటాయి. ధరలు కొంచెం పెరిగినా సామాన్యలు అల్లాడిపోతారు. కానీ అదే కూరగాయల ధరలు లక్షల్లో ఉంటే.. అవును.. మన దేశంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ ఏంటనేది మీకు తెలుసా..? అయితే ఆ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా పండిస్తారో తెలుసా..?
Most Expensive Vegetable In India
Krishna S
|

Updated on: Dec 20, 2025 | 8:24 AM

Share

సాధారణంగా మార్కెట్‌లో కూరగాయల ధరలు వందల్లో ఉంటేనే మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ మన దేశంలో కొన్ని రకాల కూరగాయల ధర వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వీటి ధర విలాసవంతమైన లగ్జరీ వాచ్‌లతో పోటీ పడుతుంటుంది. ఇంతకీ దేశంలో అత్యంత ఖరీదైన ఆ కూరగాయలు ఏవి? వాటి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

హాప్ షూట్స్

భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయలలో హాప్ షూట్స్ మొదటి స్థానంలో ఉంటుంది. దీని ధర కిలోకు రూ.85,000 నుండి రూ.లక్ష వరకు ఉంటుంది. మన దేశంలో ఇవి ప్రధానంగా బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని పరిమిత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. వీటి సాగు చాలా కష్టమైన పని. ఇవి వరుస క్రమంలో పెరగవు. కాబట్టి వీటిని కోయడానికి యంత్రాలను వాడలేరు. ప్రతి రెమ్మను రైతులు వెతికి పట్టుకుని, చేతితో జాగ్రత్తగా కోయాల్సి ఉంటుంది. ఒక కిలో సేకరించడానికి వందలాది రెమ్మలను వెతకాల్సి వస్తుంది. ఇందులో ఉండే హ్యూములోన్, లుపోలోన్ వంటి ఆమ్లాలు క్యాన్సర్ కణాలతో పోరాడటమే కాకుండా టీబీ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

గుచ్చి పుట్టగొడుగు: కిలో రూ. 40,000

ప్రకృతి సిద్ధంగా దొరికే అత్యంత ఖరీదైన కూరగాయలలో గూచీ పుట్టగొడుగు ఒకటి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని అడవుల్లో దొరికే ఈ పుట్టగొడుగుల ధర కిలో రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు ఉంటుంది. గుచ్చి పుట్టగొడుగులను మనం సొంతంగా సాగు చేయలేము. ఇవి హిమపాతం లేదా తుఫానులు సంభవించిన తర్వాత పర్వత ప్రాంతాల్లో చల్లని వాతావరణంలో మాత్రమే సహజంగా పెరుగుతాయి. వీటి లభ్యత చాలా తక్కువ కాబట్టి వీటికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం

ఈ ఖరీదైన కూరగాయలలో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా హాప్ షూట్స్, పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం నివారించడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అరుదైన లభ్యత, కష్టతరమైన సాగు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలే ఈ కూరగాయల ధరను ఆకాశానికి చేరుస్తున్నాయి. ఇవి సామాన్యుల పళ్లెంలోకి చేరడం కష్టమే అయినా వీటిలోని ఔషధ గుణాలు మాత్రం అద్భుతమని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..