పొద్దున్నే ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి రెబ్బలు తింటే జరిగేదిదే
05 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఇంపైన రంగులో... ఘాటుగా ఉండి వంటకాలకు రుచిని అందిస్తుంది వెల్లుల్లి. దాంతోపాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా. అవేంటో తెలుసుకుందాం
TV9 Telugu
వెల్లుల్లిలో మాంగనీస్, విటమిన్ సి, బి6, సెలీనియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
TV9 Telugu
వెల్లుల్లి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది
TV9 Telugu
వెల్లుల్లిని కూరగాయలు మొదలైన వాటిలో మసాలాగా ఉపయోగిస్తారు. చట్నీకి కూడా ఉపయోగిస్తారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటే ఎన్నో రోగాలు నయం అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
వెల్లుల్లిలో పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా వేడెక్కించే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే శీతాకాలంలో ప్రతిరోజూ ఉదయం వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది
TV9 Telugu
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన ఇతర కాలానుగుణ ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి
TV9 Telugu
కొంతమందిలో శీతాకాలంలో కీళ్లు, కండరాల నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు నమలడం వల్ల చాలా మేలు జరుగుతుంది
TV9 Telugu
వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి. ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల గుండె, మెదడు రెండింటికీ మేలు జరుగుతుంది. ఇందులో ఉండే అల్లిసిన్ సమ్మేళనం శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది