- Telugu News Photo Gallery Chanakya Niti: According to chanakya niti follow these tricks when somebody hurts your faith
Chanakya Niti: ఎవరైనా మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తే.. ఇలా బుద్ధి చెప్పండి! జీవితంలో మళ్లీ ఎదురుపడరు
మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. మనతో స్నేహం నటించి వెనుక గోతులు తవ్వేవారు మన చుట్టూ చాలా మందే ఉంటారు. ఇలాంటి వారు అవకాశం దొరకగానే మనపై వేటు వేస్తారు. ఇలాంటి సందర్భాల్లో మనసు ఎంతో గాయపడుతుంది. అయితే ఇలాంటి వారి గురించి ఆలోచింది సమయం వృద్ధా చేసుకోవద్దంటున్నాడు చాణిక్యుడు. మీ లైఫ్ లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే మీ స్పందన ఎలా ఉండాలంటే..
Updated on: Jan 05, 2025 | 1:18 PM

మన అని నమ్మేవాళ్లు ఎక్కువగా మనలను మోసం చేస్తుంటారు. చాలా మందికి ఈ అనుభవం ఉంటుంది. ఎంతో నమ్మిన వ్యక్తి ద్రోహం చేస్తే ఆ బాధ వర్ణణాతీతం. కానీ మీరు ఇలాంటి వారి గురించి చింతిస్తూ సమయాన్ని వృథా చేయకుండా చాణక్యుడి సూచనలను పాటిస్తే, మీరు విజయవంతమైన వ్యక్తిగా మారవచ్చు.

జీవితంలో డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, సరైన స్థలంలో ఎలా ఖర్చు చేయాలో కూడా తెలుసుకోవాలి. డబ్బును తప్పుడు చోట పెట్టుబడి పెట్టడం వల్ల జీవితంలో నష్టాలు వస్తాయి. డబ్బు, సరిగ్గా పెట్టుబడి పెట్టినట్లయితే, జీవితంలో విజయం సాధించవచ్చు.

మీకు ఎవరు ద్రోహం చేశారో వారి గురించి ఇతరులకు చెప్పకండి. కానీ ఆ తప్పులను పునరావృతం చేయవద్దు. ఒక వ్యక్తి తన తప్పుల నుంచి మాత్రమే కాదు ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకోవాలి. మీరు ఈ పాఠం నేర్చుకుంటే, జీవితంలో ఎలాంటి తప్పులు చేయరు. ఇతరు చేతిలో సులువుగా మోసపోరు. తద్వారా సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలుగుతారు. విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది అని చాణక్యుడు చెబుతున్నాడు.

కష్టపడి సంపాదించిన విజయానికి నిజమైన విలువ ఉంటుంది. అదే అబద్ధాల ద్వారా సాధించిన విజయం శాశ్వతంగా ఉండదు. ఈ విజయం క్షణికానందం కాలిగించినా కాలక్రమేణా పతనానికి దారి తీస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి విజయం ఎల్లప్పుడూ సత్య మార్గంలోనే సాగాలి. ఇలాంటి వారు తమకు ప్రియమైన వారు మోసం చేసినా ఆ బాధ నుంచి కోలుకోగలరని చాణక్యుడు చెప్పాడు.

ఎవరినీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఒక వ్యక్తి తనకు అధికం జ్ఞానం ఉందని భావించినప్పుడు.. ఎదుటి వ్యక్తిని బలహీనంగా భావిస్తాడు. అతనిలో అహంభావం పుడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వ్యక్తిని బలహీనంగా భావించకూడదు. ఎదుటి వ్యక్తి తన శక్తిని బహిర్గతం చేయకపోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు అతనిని విస్మరిస్తే, మీ స్వంత విధ్వంసానికి మీరే కారకులు అవుతారు.




