Period Cramps: ఆ సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ వెరీ కామన్‌.. వీటి నుంచి బయటపడాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి సక్రమంగా ఉండాలి. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా నేటి జీవనశైలి కారణంగా అమ్మాయిలకు ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విపరీతమైన కడుపునొప్పితోపాటు మూడ్ స్వింగ్స్ కుదురుగా ఉండనివ్వవు. వీటి నుంచి బయటపడాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి..

Srilakshmi C

|

Updated on: Jan 05, 2025 | 12:38 PM

పీరియడ్స్ సమయంలో చాలా మంది తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఈ సమయంలో మూడ్ స్వింగ్స్, ఇతర సమస్యలు కనిపిస్తాయి. అయితే పీరియడ్స్‌ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు కొన్ని రకాల ఆహారాలు ఉపయోగపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5
పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి ఉంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. పీరియడ్స్ సమయంలో చాలా మందికి చిరాకు, కోపం వంటివి వస్తుంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు ఈ మూడ్ స్వింగ్‌లను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో అలాంటి ఆహారాలను మెనూలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

2 / 5
ఈ సమయంలో చాలా మంది ఆందోళన, నిరాశను అనుభవిస్తారు. చిన్న విషయం కూడా కోపాన్ని కలిగిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి మూడ్ స్వింగ్‌లను నియంత్రించడానికి ఈ ప్రత్యేకమైన కొవ్వు పదార్ధాలను మెనూలో చేర్చుకోవాలి.

3 / 5
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు.. సీఫుడ్‌లో అధికంగా ఉంటుంది. సాల్మన్, మాకేరెల్, ట్యూనా, హెర్రింగ్, సార్డిన్ - చేపలు మంచివి. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు. ఈ చేపలలో అవి అధికంగా ఉంటాయి.

4 / 5
గుడ్లలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అలాగే పెరుగు, పాలు కూడా తినవచ్చు. సోయాబీన్స్,  బాదం, వాల్ నట్స్, హాజెల్ నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్.. వంటి ఆహారాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

5 / 5
Follow us