పెసరపప్పులో పాలకూర కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..
05 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఇంట్లో పిడికెడు పెసరపప్పు ఉంటే చాలు... పండగే! ఏ కాయగూరలూ లేకపోతే.. కమ్మని కిచిడీ అవుతుంది. ‘అతిథులొస్తే’.. హల్వాగా మారి ఆనందాలు పంచుతుంది
TV9 Telugu
రుచికేకాదు పెసర పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్ బీ9, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బీ4 , ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ బీ2, బీ3, బీ5, బీ6 పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
అయితే పెసరపప్పును పాలకూరతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ ఎ, సి, కె, బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, జింక్, కాపర్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి
TV9 Telugu
పెసరపప్పు, పాలకూర రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కలిపి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. మూంగ్ పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది
TV9 Telugu
పెసరపప్పులోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూరలో మెగ్నీషియం, కాల్షియం కండరాలను బలంగా చేస్తాయి. పెసరపప్పు, పాలకూర రెండింటిలోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది
TV9 Telugu
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిని తింటే పొట్ట సమస్యలు నయమవుతాయి. పాలకూరలో ఉండే విటమిన్ సి, పెసరపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి వ్యాధులు, ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి