Nails: మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ చేతి గోర్లు ఇట్టే చెప్పేస్తాయ్.. ఎలా ఉన్నాయో చూస్తున్నారా? 

ఆరోగ్య సమస్యలు వస్తే రక్త పరీక్షలు, సిటీ స్కాన్, ఎక్స్ రే.. వంటి రకరకాల పరీక్షలు చేయించుకోవడం ద్వారా తెలుస్తాయి. అయితే ఇలాంటివి ఏమీ అవసరం లేకుండానే సులువుగా మీ ఆరోగ్య సమస్యలను కేవలం మీ చేతి వేళ్ల గోర్లు చూసి ఇట్టే చెప్పొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఈ కింది లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ వద్దకు పరిగేత్తాల్సిందే..

Nails: మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ చేతి గోర్లు ఇట్టే చెప్పేస్తాయ్.. ఎలా ఉన్నాయో చూస్తున్నారా? 
Nails
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2025 | 12:55 PM

మన శరీరంలోని ప్రతి భాగం మనకు అమూల్యమైనదే. ముఖ్యంగా చేతి గోర్లపై చాలా మంది శ్రద్ధపెట్టరు. కొందరికి గోర్లు సులభంగా విరిగిపోతుంటాయి. మరికొందరికి గోర్లు సక్రమంగా పెరగవు. గోర్లు బలహీనంగా ఉండడమే దీనికి కారణం. వాతావరణం, తరచుగా చేతులు కడుక్కోవడం దీనికి ప్రధాన కారణం అని మీరు అనుకోవచ్చు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం బలహీనమైన గోర్లు అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతాలు. పోషకాల కొరత వల్ల గోళ్లు బలహీనంగా మారతాయి. అయితే శరీరంలో ఏదైనా సమస్య తలెత్తినా.. అది వెంటనే కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వీటిని చేతి గోర్లు కూడా వెల్లడిస్తాయి. ఎలాగంటే..

సన్నని మృదువైన గోర్లు

సన్నని, మృదువైన గోర్లు ఉన్నవారికి తలనొప్పి, ఆందోళన కలిగిస్తాయి. ఇలాంటి గోర్లు కలిగి ఉన్న వారిలో విటమిన్ B లోపం కనిపిస్తుంది. వీరి శరీరంలో కాల్షియం, ఐరన్, కొవ్వు ఆమ్లాల లోపం ఉండవచ్చు.

స్పూన్‌ గోర్లు

నెయిల్స్ నిటారుగా కాకుండా స్పూన్‌ ఆకారంలో ఉంటాయి. వీటినే చెంచా గోర్లు అంటారు. మీకూ ఇలాంటి గోర్లు ఉంటే మీకు రక్తహీనత, హైపోథైరాయిడిజం, కాలేయ సమస్యలు ఉండే ఛాన్స్ ఉంది. మీ ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

తెల్ల మచ్చలు

గోళ్లపై తెల్లటి మచ్చలు ఉంటే.. ఇవి ఆరోగ్యం గురించిన అనేక విషయాలను వెల్లడిస్తాయి. గోళ్ళపై తెల్లటి మచ్చలు జింక్ లోపం, ఫంగల్ ఇన్ఫెక్షన్‌లకు సంకేతం.

పసుపు గోర్లు

గోర్లు పసుపు రంగులోకి మారడానికి అత్యంత సాధారణ కారణం అధిక ధూమపానం. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ వ్యాధిని సూచిస్తుంది. అంతేకాకుండా పసుపు గోర్లు మధుమేహానికి సంకేతం.

టెర్రీ నెయిల్స్

మీ గోళ్లు ఇలా కనిపిస్తే అది కాలేయం, కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారాలో గుండె సమస్యలు కూడా ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.