Airport: ఎయిర్‌పోర్ట్‌ టాయిలెట్‌లో గన్‌ పేలిన శబ్ధం.. ఏంటాని వెళ్లి చూడగా షాకింగ్‌ సీన్‌

నిత్యం ప్రయాణికుల రాకపోకలతో బిజీగా ఉండే అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు వాష్ రూంలోకి వెళ్లిన ఓ CRPF జవాన్ ఎంతకూ బయటకు రాలేదు. కాసేపటి తర్వాత ఉన్నట్లుండి పెద్ధ శబ్ధంతో గన్ పేలిన శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలో ఉన్న సిబ్బంది పరుగుపరుగున వెళ్లి చూడగా వాష్ రూంలో భయానక దృశ్యం కంటపడింది..

Airport: ఎయిర్‌పోర్ట్‌ టాయిలెట్‌లో గన్‌ పేలిన శబ్ధం.. ఏంటాని వెళ్లి చూడగా షాకింగ్‌ సీన్‌
Airport Washroom
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2025 | 11:14 AM

సూరత్, జనవరి 5: ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ టాయిలెట్‌లోకి వెళ్లి తన సర్వీస్‌ గన్‌తో కాల్చుకుని మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌ సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగింది.

మృతుడిని జైపూర్‌కు చెందిన 32 ఏళ్ల కిషన్ సింగ్‌ సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌గా గుర్తించాడు. కిషన్‌ సింగ్‌ అక్కడ గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని టాయిలెట్‌కు వెళ్లాడు. ఏం జరిగిందో తెలియదుగానీ సర్వీస్‌ రైఫిల్‌తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిషన్‌సింగ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీ భర్వాద్ తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలిసి ఎయిర్‌పోర్ట్‌లోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

2015లో సీఐఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా చేరిన సింగ్.. 2022లో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. అతను గత ఏడాది కాలంగా సూరత్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వహించాడు. విమానాశ్రయం లోనికి వెళ్లే గేటు సమీపంలోని వాష్‌రూమ్ గన్‌ షాట్ శబ్ధం వినిపించిన వెంటనే, ఇతర CISF జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న కిషన్ సింగ్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మృతి చెందాడు. స్పాట్‌లో ఎటువంటి అనుమానాస్పద ఆధారాలు కనిపించలేదు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు సూరత్ విమానాశ్రయం ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌పీ గోహిల్ తెలిపారు. కాగా పారామిలటరీ దళం CISF ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.