AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మరికాసేపట్లో పెళ్లి.. బాత్రూమ్‌కి వెళ్లిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

40 ఏళ్ల వయస్సు.. అతనికి రెండో పెళ్లి.. మొదటి భార్య చనిపోవడంతో.. రెండో పెళ్లి కుదుర్చున్నాడు.. అమ్మాయిని చూసి ఓకే చెప్పాడు.. రెండో వివాహం కోసం మధ్యవర్తికి బాగానే పైకం ఇచ్చాడు.. ఆమె గురించి అతనికి పూర్తిగా తెలీదు.. కానీ.. వేలకు వేలు డబ్బులిచ్చి.. చీరెలు, నగలు.. ఇలా అన్ని కొనిచ్చాడు..

Viral: మరికాసేపట్లో పెళ్లి.. బాత్రూమ్‌కి వెళ్లిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Bride (representative image)
Shaik Madar Saheb
|

Updated on: Jan 05, 2025 | 11:58 AM

Share

40 ఏళ్ల వయస్సు.. అతనికి రెండో పెళ్లి.. మొదటి భార్య చనిపోవడంతో.. రెండో పెళ్లి కుదుర్చున్నాడు.. అమ్మాయిని చూసి ఓకే చెప్పాడు.. రెండో వివాహం కోసం మధ్యవర్తికి బాగానే పైకం ఇచ్చాడు.. ఆమె గురించి అతనికి పూర్తిగా తెలీదు.. కానీ.. వేలకు వేలు డబ్బులిచ్చి.. చీరెలు, నగలు.. ఇలా అన్ని కొనిచ్చాడు.. మరికాసేపట్లో పెళ్లి అనగా.. ఆమె మాత్రం.. మంచిగా తయారై బాత్రూంకి వెళ్లొస్తా అని వెళ్లింది.. కానీ తిరిగిరాలేదు.. దీంతో తాను మోసపోయానని గమనించి ఒక్కసారిగా లబోదిబోమన్నాడు.. పెళ్లి కొడుకు.. ఈ షాకిగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది.. మరికాసేపట్లో పెళ్లి అనగా.. వధువు నగదు, ఆభరణాలతో పారిపోయింది. ఈ ఘటన ఖజ్నీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మొదటి భార్యను కోల్పోయిన కమలేష్ కుమార్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.. గోరఖ్‌పూర్‌లోని భరోహియాలోని శివాలయం వద్ద వివాహ వేడుక మొదలైంది.. ఆచార వ్యవహారాలు సాగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వధువు, ఆమె తల్లి కనిపించకపోవడంతో ఈ నాటకం ఆవిష్కృతమైంది.

సీతాపూర్‌లోని గోవింద్‌పూర్‌ గ్రామానికి చెందిన కమలేష్‌ అనే రైతు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి కోసం మధ్యవర్తికి రూ.30,000 కమీషన్ ఇస్తూ మహిళతో సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. పెళ్లి ఖర్చులు కూడా భరిస్తానని మాటిచ్చాడు.. శుక్రవారం పెళ్లి తంతు మొదలైంది.. వధువు తన తల్లితో కలిసి ఆలయానికి వచ్చింది.. కమలేష్ తన కుటుంబంతో అక్కడకు చేరుకున్నాడు..

అంతకుముందే.. మహిళకు చీరలు, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆభరణాలు కొనిచ్చానని.. పెళ్లి ఖర్చులు కూడా తానే భరిస్తున్నానని కమలేష్ పేర్కొన్నాడు.. అయితే, పెళ్లి ఆచారాలు ప్రారంభమైన తరువాత వధువు బాత్రూమ్‌కు వెళ్లి తిరిగి రాలేదని కమలేష్ చెప్పాడు.. వధువుతోపాటు ఆమె తల్లి కూడా అదృశ్యమైందని చెప్పాడు..

“నేను నా కుటుంబాన్ని పునర్నిర్మించాలనుకున్నాను.. కానీ ఇప్పుడు ప్రతిదీ కోల్పోయాను” .. అని కమలేష్ మీడియా ఎదుట చెప్పాడు.

అయితే.. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అయితే ఎవరైనా చేస్తే దర్యాప్తు చేస్తామని సౌత్ పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..