Poonam Kaur: ‘త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలే..’ పూనమ్ విమర్శలపై స్పందించిన ‘మా’

పూనమ్ కౌర్ నెట్టింట వేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇస్తే మా అసోసియేషన్ ఇంత వరకు ఏం యాక్షన్ తీసుకోలేదంటూ ఆమె తన బాదను వెళ్లగక్కింది. దీనిపై 'మా' కూడా రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Poonam Kaur: 'త్రివిక్రమ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలే..' పూనమ్ విమర్శలపై స్పందించిన 'మా'
Poonam Kaur - Trivikram
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2025 | 3:38 PM

పూనమ్ కౌర్ నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం తను చేసిన ఓ ట్వీట్ నెట్టింట అగ్గి రాజేసింది. దర్శకుడు త్రివిక్రమ్ మీద తాను ఫిర్యాదు చేస్తే… ‘మా’ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పూనమ్ కౌర్ మండి పడింది. కనీసం అతడ్ని ప్రశ్నించే ప్రయత్నం చేయలేదని తన బాధను వెళ్లగక్కింది. నా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని… జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత కూడా అతడ్ని ఇండస్ట్రీలోని పెద్ద తలలు ప్రొత్సహించాయి ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చింది. దీనిపై ‘మా’ అసోసియేషన్ స్పందించింది.

పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ‘మా’ కోశాధికారి శివబాలాజీ తెలిపారు. గతంలో  ఫిర్యాదు ఇచ్చినట్టు కూడా రికార్డులలో లేదని వెల్లడించాడు. పూనమ్ కౌర్ ఇలాంటి విషయాలు ట్విట్టర్‌లో పెట్టడం వల్ల ఉపయోగం లేదని శివబాలాజీ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్‌ను కానీ, కోర్టులను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని సూచించాడు. మరి ‘మా’ స్పందనపై  పూనమ్ కౌర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

కాగా పూనమ్ కౌర్ చాలా ఏళ్లుగా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా త్రివిక్రమ్ మీద విమర్శలు చేస్తూనే వస్తుంది. తాజాగా ఆయన పేరునే ప్రస్తావించి.. తన జీవితాన్ని నాశనం చేశాడని.. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అనడం తీవ్ర చర్చనీయాశంమైంది. ఈ క్రమంలోనే ‘మా’ నుంచి స్పందన వచ్చింది. మరి పూనమ్ కౌర్, త్రివిక్రమ్ మధ్య అసలు సమస్య ఏంటో వారిద్దరిలో ఒకరు నోరు తెరిస్తేనే సమాజానికి తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.