ఏం అందం సామి.. పూజిత ఇలా చూస్తే మైమరచిపోర కుర్రకారు

Phani CH

06 January 2025

పూజిత పొన్నాడ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన ఈమె తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

05 అక్టోబర్ 1989న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెస్టినీ సిటీ విశాఖపట్నంలో జన్మించింది వయ్యారి భామ పూజిత పొన్నాడ.

తమిళనాడులోని చెన్నైలోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి B.Tech సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టా పొందింది.

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఊపిరి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

రంగస్థలం సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది.. తరువాత రాజు గాడు హ్యాపీ వెడ్డింగ్ బ్రాండ్ బాబు వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ వంటి మొదలగు సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం ఈమె ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తుంది. అది తప్ప ఈమె చేతిలో ఇంకో ఆఫర్ లేదు అనే చెప్పాలి.

ఇది ఇలా ఉంటే తాజాగా ముద్దుగుమ్మ పూజిత పొన్నాడ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట క్రేజీ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.