AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology 2025: కీలక గ్రహాల ప్రభావం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!

జనవరి తర్వాత కొన్ని గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. శుక్రుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం, కుజుడు మిథునంలోకి ప్రవేశించడం, గురువు వక్ర త్యాగం చేయడం జరగబోతుంది. ఈ కారణాల వల్ల కొన్ని రాశులవారికి ధనపరంగా అనేక అదృష్టాలు కలగే అవకాశముంది. అలాగే ఉచ్ఛలో ఉన్న శుక్రుడితో గురువు పరివర్తన చెందడం వల్ల కూడా అనేక రకాలుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది.

Money Astrology 2025: కీలక గ్రహాల ప్రభావం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
పుట్టగొడుగుల పెంపకం.. దీనికి మీకు ఎక్కువ భూమి అవసరం లేదు. అటు పెట్టుబడి కూడా పెట్టాల్సిన పన్లేదు. తక్కువ ఖర్చుతో మీ ఇంటిలోనే ఇది ప్రారంభించవచ్చు.
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 06, 2025 | 10:01 PM

Share

జనవరి తర్వాత నుంచి శుక్రుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం, కుజుడు మిథునంలోకి ప్రవేశించడం, గురువు వక్ర త్యాగం చేయడం వంటి కారణాల వల్ల కొన్ని రాశులవారికి ధనపరంగా అనేక అదృష్టాలు కలగబోతున్నాయి. పైగా, ఉచ్ఛలో ఉన్న శుక్రుడితో గురువు పరివర్తన చెందడం వల్ల కూడా అనేక రకాలుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ ధన యోగాలు నెల రోజుల పాటు కొనసాగే అవకాశం కూడా ఉంది.

  1. వృషభం: ఈ రాశికి శుక్ర, గురు, కుజులు పూర్తి స్థాయిలో ఆర్థిక లాభాలను కలిగించే అవకాశం ఉంది. పెట్టుబడులు, మదుపులు, ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక వ్యవహారాల మీద ఆసక్తి పెరగడంతో పాటు, ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఫలితంగా ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. రాజీమార్గం ద్వారా ఆస్తి వివాదం పరిష్కరించుకుని విలువైన ఆస్తిని సొంతం చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి ఈ మూడు గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడం ద్వారా అత్యధికంగా లాభాలు కలుగుతాయి. షేర్లు లాభాల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూ లాభం కలుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది.
  3. కన్య: ఈ రాశివారికి గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ వృద్ధి కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తిపాస్తుల ద్వారా కూడా రాబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు తప్పకుండా వసూలవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగు తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. తల్లితండ్రుల ద్వారా కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి. విదేశీ సంపాదన లభించే అవకాశం కూడా ఉంది. షేర్లు బాగా లాభిస్తాయి.
  4. వృశ్చికం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితోపాటు గురు, శుక్రులు అనుకూలంగా మారుతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి, అప్రయత్న ధన లాభాలకు కూడా అవకాశం ఉంది. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ది చెందుతుంది. సాధారణంగా ఏ ఆదాయ వృద్ధి అవకాశాన్నీ వదులుకునే అవకాశం ఉండదు.
  5. మకరం: ఈ రాశికి ఈ మూడు గ్రహాలు ఆర్థికంగా చేయూతనివ్వడం జరుగుతుంది. ఆదాయం అనేక విధా లుగా వృద్ధి చెందడం వల్ల వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు తదితర ఆర్థిక లావాదేశీల ద్వారా ఆదా యం బాగా పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగు తుంది. ఆస్తులను పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
  6. కుంభం: ఈ రాశికి శుక్ర, గురులు బాగా అనుకూలంగా మారడం జరుగుతుంది. ఫలితంగా ధన వ్యవహా రాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు రాజీమార్గం ద్వారా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. విదేశీ సంపాదనను అనుభవించే సూచనలు కూడా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రావలసిన సొమ్ము వసూలవుతుంది.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్