Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 7, 2025): మేష రాశి వారి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. మిథున రాశి వారికి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జనవరి 7, 2025): మేష రాశి వారి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు, వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేపడతారు. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, పనులన్నీ సానుకూలపడతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. సహోద్యోగులతో అదనపు బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట చెందుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్ని చక్కబెడతారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుం టుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించు కోవడం మంచిది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో కొద్దిగా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు చాలావరకు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు సమయం బాగాఅనుకూలంగా ఉంది. సోదరులతో ఆస్తి వివా దాలు కొద్దిగా చికాకు పెడతాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయ త్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగు లకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలనిస్తుంది. వ్యక్తిగత సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు ఆదాయం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలో చనల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఆస్తి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ది చెందు తుంది. లాభాలకు లోటుండదు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల వివాదాలకు దూరంగా ఉండ డం మంచిది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరు లతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరో గ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచ నాలకు మించి రాబడి పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి కొద్దిగా బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్త వుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి లోటుండ కపోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి బాగాఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగి పోతాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా కొద్దిగా కోలుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సరికొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు మారిపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయ త్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్ధిక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరు ద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబసమేతంగా దైవదర్శనాలు చేసుకుం టారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.