Telugu Astrology: కుజ, రవులతో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?
రవి, కుజులు ప్రాణ స్నేహితులు. ఈ స్నేహ గ్రహాల పరస్పర వీక్షణ కారణంగా కొన్ని గ్రహాలకు అధికార లాభం, ఆస్తి లాభం, ఆదాయ లాభం కలిగించే అవకాశం ఉంది. ఈ నెల 21న కుజుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశించే వరకూ కుజుడు వల్ల యోగం కలిగించడం జరుగుతుంది.
ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు కుజ గ్రహం విజృంభించబోతోంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచబడి, వక్రించి ఉన్న కుజ గ్రహానికి సప్తమ స్థానంలో 15వ తేదీన రవి ప్రవేశించి, కుజుడిని వీక్షించడం వల్ల ఈ గ్రహం మరింత బలంతో వ్యవహరించబోతోంది. రవి, కుజులు ప్రాణ స్నేహితులు. పరస్పర వీక్షణ కారణంగా ఈ రెండు గ్రహాలు మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన గ్రహాలకు అధికార లాభం, ఆస్తి లాభం, ఆదాయ లాభం కలిగించే అవకాశం ఉంది. ఈ నెల 21న కుజుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశించే వరకూ కుజుడు వల్ల యోగం కలిగించడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో వక్రించి ఉండడం ఒక విశేషం కాగా, ఆ కుజుడిని రవి వీక్షించడం మరో విశేషం. ఈ రాశివారికి తప్పకుండా ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా తప్పకుండా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కా రమవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో ఉన్న కుజుడిని సప్తమం నుంచి రవి వీక్షించడం వల్ల ఈ రాశివారికి ధన యోగాలు కలుగుతాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్ళి నిశ్చయం అవుతుంది. తండ్రి నుంచి సంపద లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కుజుడి మీద రవి దృష్టి పడినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- తుల: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడిని రవి వీక్షించడం వల్ల ప్రభుత్వపరమైన గుర్తింపు లభించడం, ఆర్థిక లాభం కలగడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న వారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. సొంత ఇంటి ప్రయ త్నాలు నెరవేరుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. ఉద్యోగంలో పదోన్న తులు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- వృశ్చికం: భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడి మీద దశమాధిపతి రవి దృష్టి పడినందువల్ల ఉద్యోగ పరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి చాలా వరకు బయటపడతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విదేశీయానానికి అవ రోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.
- మీనం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రవి, పంచమ స్థానంలో ఉన్న కుజుడు పరస్పరం వీక్షించుకుంటు న్నందువల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపుతో పాటు, ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. అధికార లాభం, ఆస్తి లాభం, ఆదాయ లాభం కలుగుతాయి. ఉన్నత స్థాయికి చెందిన కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది.