- Telugu News Photo Gallery Cinema photos Ram charan unstoppable with nbk in aha promo goes viral in social media
Unstoppable with NBK: దుమ్మురేపుతున్న అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమో.. అదిరిపోయిన చరణ్ విజువల్స్
గియర్ అప్ ఫర్ ద డబుల్ ధమాకా అంటూ దుమ్మురేపుతోంది ఆహా అన్‌స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో. ప్రెజెంటింగ్ యు టు ద మెగా ఎపిసోడ్ అంటూ అద్దిరిపోయే రామ్‌చరణ్ విజువల్స్ తో ప్రోమో కట్ చేశారు. అసలే బాలయ్య.. ఎదురుగా చరణ్ ఉంటే అంత తేలిగ్గా వదిలేస్తారా? మెగా వారసుడి గురించి మాట్లాడి ఆటపట్టించేస్తారుగా... ఇంకేమేం విశేషాలున్నాయంటారా? చూసేద్దాం పదండి...
Updated on: Jan 06, 2025 | 8:00 PM

nbk వెర్సస్ ఆర్సీ... ఒక్క స్టేజ్ మీద కనిపిస్తే.. ప్రతి ఫ్రేమూ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉండకపోతే ఎలా... యస్.. దీన్ని దృష్టిలో ఉంచుకునే డిజైన్ చేసినట్టున్నారు లేటెస్ట్ ఎపిసోడ్‌ని.

ప్రతి ఫ్రేమూ ఫిదా చేస్తోంది మెగా పవర్ స్టార్ అభిమానులను. సర్‌ప్రైజుల మీద సర్‌ప్రైజులున్నాయి అని బాలయ్య అంటే.. కొంచెం టెన్షన్‌గా ఉంది సార్ అని చెర్రీ కంగారు పడటంతోనే ప్రోమో క్లిక్ అయిందన్నది క్రిటిక్స్ మాట.

చెర్రీ గురించి అందరూ చెప్పడం వేరు.. ఆయన్ని కన్న తల్లి, నాయనమ్మ చెప్పడం వేరు.. చెప్పడం సంగతి పక్కనపెడితే, 2025లో వారసుడు కావాలంటూ వాళ్లు అడిగిన తీరుకు ముచ్చటపడిపోతున్నారు అభిమానులు.

చుట్టూ స్టాఫ్‌తో ఎప్పుడూ బిందాస్‌గా గడిపే గ్లోబల్‌స్టార్, తన కూతురు క్లింకారకు అన్నం తినిపించడానికి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారో తెలుసా? ప్రతి రోజూ రెండు గంటలు ఆయన టైమ్ కేటాయించేది ఎవరి కోసం? చెర్రీ - ఉపాసన మధ్య రైమ్ రోల్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలు తెలుసుకోవాలంటే డోంట్ మిస్ లేటెస్ట్ ఎపిసోడ్.

జనవరి 8న రాత్రి ఏడు గంటలకు ఆహాలో ప్రసారం కానుంది ఈ ఎపిసోడ్. గెస్టుగా వచ్చిన శర్వానంద్.. షోలో ఫోన్ ఎందుకు వాడలేదు? దిల్‌రాజు తొడ కొట్టడానికి రీజన్ ఏంటి? ప్రభాస్ ఫోన్‌లో చెప్పిన సంగతులేంటి? పార్టీ చేసుకోవడానికి అల్లు అరవింద్ బెస్ట్ అని చెర్రీ ఎందుకు ఆన్సర్ చేశారు? ఇంతకీ పవన్ కల్యాణ్ యాక్టర్‌గా బెస్టా? పొలిటీషియన్‌గా బెస్టా... అబ్బో.. ఇలాంటి చాలా చాలా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ప్యాక్ అవుతోంది మెగా ఎపిసోడ్.. డోంట్ మిస్ ఇట్ ఇన్.. ఆహా అన్‌స్టాపబుల్!




