- Telugu News Photo Gallery Cinema photos Balakrishna Daaku Maharaaj pre release event function and trailer review
Daaku Maharaaj: డల్లాస్ లో ఘనంగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
డల్లాస్‌లో డాకు మహారాజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది...మా బాలయ్య ఇంటర్నేషనల్ ఈవెంట్ అంటే మాకు పండగ రోజే అంటూ జోష్‌గా కనిపిస్తున్నారు నందమూరి అభిమానులు. డల్లాస్ వేదిక మీద రిలీజ్ అయిన ట్రైలర్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ డాకు ట్రైలర్ ఎలా ఉంది?
Updated on: Jan 06, 2025 | 7:57 PM

మాస్ స్వాగ్‌కి సరికొత్తగా మీనింగ్ చెబుతోంది నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ట్రైలర్. పవర్‌ఫుల్ పంచ్ అంటే అచ్చం ఇలాగే ఉంటుందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ది కింగ్ ఆఫ్ జంగిల్.. రూత్‌లెస్ హంట్ బిగిన్ చేశారంటూ సంబరపడుతోంది నందమూరి ఆర్మీ. డల్లాస్ ప్రీ రిలీజ్ వేడుకలో ఘనంగా విడుదల చేశారు డాకు మహారాజ్ ట్రైలర్‌ని.

బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్‌ని ఈ సినిమాలో విట్‌నెస్ చేయడం గ్యారంటీ అంటూ ఆల్రెడీ ఊరిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమూ కమర్షియల్ వేల్యూస్ కనిపించేలా ఉంది.

సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అంటూ మెచ్చుకుంటున్నారు ఫ్యాన్స్. 2024ని మిస్ అయిన అభిమానుల కోసం 2025లో నందమూరి బాలకృష్ణ ఫుల్ మీల్స్ తో రెడీ అవుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

జనవరి 12న రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ కోసం శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక్క షాట్‌కి కూడా బాలకృష్ణ డూప్‌ని వాడలేదంటూ డైరక్టర్ బాబీ చెప్పిన మాటలు కూడా ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేస్తున్నాయి.




