ఇలాంటి లుక్స్ చూస్తే  కుర్రాళ్లు కంట్రోల్‌ తప్పరా రకుల్

Phani CH

06 January 2025

రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది.

18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో  కన్నడ చిత్రం 'గిల్లి'తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది, ఇది తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది.

ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.

అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తూ  వైరల్ చేస్తున్నారు.