AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Tips: తీవ్ర ఒత్తిడితో చిత్తవుతుంటే.. పతంజలి సూచించిన ఈ 5 ప్రాణాయామాలు రోజూ చేయండి..

బాబా రామ్‌దేవ్ ఒక ప్రసిద్ధ యోగా గురువు మాత్రమే కాదు ఆయన ఆయుర్వేద వైద్యం చేయడంలో ప్రసిద్ధిగాంచారు. ఆయుర్వేదాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అది సోషల్ మీడియా ద్వారా లేదా అతని పతంజలి ఉత్పత్తుల ద్వారా కావచ్చు. ఎవరైనా మానసికంగా బాధపడుతుంటే బాబా రామ్‌దేవ్ ఇక్కడ ఇచ్చిన కొన్ని ప్రాణాయామాలను వారు తమ దినచర్యలో భాగంగా చేసుకోవడం వలన తగిన ఫలితం దక్కుతుందని చెప్పారు.

Patanjali Tips: తీవ్ర ఒత్తిడితో చిత్తవుతుంటే.. పతంజలి సూచించిన ఈ 5 ప్రాణాయామాలు రోజూ చేయండి..
Patanjali Tips
Surya Kala
|

Updated on: Aug 12, 2025 | 11:07 AM

Share

పతంజలి ద్వారా ప్రతి ఇంటికి ఆయుర్వేద పురాతన పద్ధతులను చెరువు చేయడంలో బాబా రామ్‌దేవ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. అది చర్మ సమస్యలు అయినా లేదా ఆరోగ్య సమస్యలు అయినా. సరే నేడు పతంజలి ఉత్పత్తుల ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ఉత్పత్తులు ప్రతిచోటా దుకాణాలలో, ఆన్‌లైన్ పోర్టల్‌లలో సులభంగా లభిస్తున్నాయి. బాబా రామ్‌దేవ్ యోగా విద్యతో పాటు సహజ వస్తువులతో తయారు చేసిన ఉత్పత్తులతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చాలా మంది జీవితాల్లో మార్పులను తెచ్చాయి. నేటి బిజీ జీవితంలో శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా బాగా ప్రభావితమవుతుంది. దీనిని ఎదుర్కోవడానికి యోగా ఒక గొప్ప మార్గం. దీనిలో శ్వాస పద్ధతులు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. కనుక పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్య శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని ప్రాణాయామాల గురించి చెప్పారు.

ఒత్తిడి,ఆందోళన కారణంగా మానసికంగా బాధపడుతుంటే, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ప్రాణాయామ పద్ధతుల సహాయం తీసుకోవచ్చు. ఇవి ఒత్తిడి, ఆందోళనతో పాటు ప్రతికూల ఆలోచనలను తగ్గించడంలో సహాయపడతాయి. వాస్తవానికి ప్రాణాయామం సమయంలో శ్వాసను క్రమబద్ధమైన లయలో ఉంచుతారు. ఇది మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది. బాబా రామ్‌దేవ్ సూచించిన 5 ప్రాణాయామాలు ఏమిటో చూద్దాం.

అనులోమ-విలోమ: బాబా రాందేవ్ పతంజలి వెల్నెస్ ప్రకారం.. అనులోమ-విలోమ అనేది శక్తివంతమైన శ్వాస ప్రక్రియ (ప్రాణాయామం). ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మనస్సును ప్రశాంతపరుస్తుంది. దీన్ని చేయడానికి ముందుగా సుఖసనంలో కూర్చోవాలి. ఆపై చేతితో ఒక ముక్కు రంధ్రం మూసి, మరొక ముక్కు రంధ్రం ద్వారా గాలిని లోపలికి పీల్చుకోవాలి. ఇప్పుడు మూసిన ముక్కు రంధ్రాన్ని తెరిచి గాలిని బయటకు విడి చేపట్టాలి. అయితే ఈ సమయంలో గాలిని లోపలి పీల్చిన ముక్కు రంధ్రాన్ని మూసివేయాలి.

ఇవి కూడా చదవండి

భస్త్రిక ప్రాణాయామం: ఈ ప్రాణాయామంలో ధ్యాన భంగిమలో కూర్చుని మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని వేగంగా , బలంగా ముక్కు ద్వారా గాలి పీల్చండి, ఆపై వేగంగా, బలంగా నోటి ద్వారా గాలిని వదలండి. ఇది ఊపిరితిత్తులను సక్రియం చేస్తుంది. మొత్తం శరీరానికి శక్తిని ఇస్తుంది. మానసికంగా కూడా రిలాక్స్‌ అయ్యేలా చేస్తుంది.

కపాలభాతి ప్రాణాయామం: పతంజలి వెల్నెస్ ప్రకారం ఈ ప్రాణాయామం చేయాలంటే ముందు ముక్కు ద్వారా గాలిని లోపలి పీల్చి.. ఆపై పొట్టను లోపలికి లాగుతూ గాలిని వేగంగా విడిచిపెట్టాలి. శ్వాస వదిలే సమయంలో పొట్ట కండరాలు సంకోచించాలి. ఇలా చేసిన తర్వాత సాధారణ శ్వాస తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోండి. కపాలభాతి ప్రాణాయామం గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

భ్రమరి ప్రాణాయామం: మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి భ్రమరి ప్రాణాయామం అద్భుతమైనది. ఇందులో రెండు చేతులను కళ్ళపై ఉంచి 3 నుంచి 5 సెకన్ల పాటు లయబద్ధంగా శ్వాస తీసుకోవాలి. ఆ సమయంలో ఓం అని ఉచ్చరించాలి.

ఉజ్జయి ప్రాణాయామం: యోగాలో ఒక ముఖ్యమైన శ్వాస ప్రక్రియ. మనశ్శాంతి పొందడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర విధానాలను మెరుగుపరచడానికి ఉజ్జయి ప్రాణాయామం చేయవచ్చు. ఇది జీర్ణక్రియ, ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దీన్ని చేయడానికి ధ్యాన భంగిమలో కూర్చుని, గొంతును ముడుచుకుంటూ రెండు నాసికా రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకోండి. ఈ సమయంలో, గురక లాంటి శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఇందులో కుడివైపు ప్రాణాయామం మూసివేసి ఎడమవైపు ప్రాణాయామం చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)