- Telugu News Photo Gallery Independence Day 2025: Tricolour Recipe Ideas to celebrate freedom with flavours
Tricolour Recipe Ideas: జెండా పండగ రోజున ఆహారాన్ని భిన్నంగా చేసుకోండి.. ట్రైకలర్ ఫుడ్ లిస్టు మీ కోసం..
భారత దేశం ఈ ఏడాది తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆ సేతు హిమాచలం అంగరంగం వైభవంగా నిర్వహించనున్నారు. దేశభక్తితో నిండిన ఈ రోజున మీ మీ పిల్లలు తినే ఆహారాన్ని భిన్నంగా తయారు చేయాలనుకున్నా.. మన జాతీయ జెండాలోని రంగులు ప్రతిబింబించేలా త్రివర్ణ వంటకాలను ట్రై చేయండి. రుచికరంగా, సులభంగా తయారు చేసుకునే కొన్ని బెస్ట్ ఫుడ్స్ లిస్టు మీ కోసం
Updated on: Aug 12, 2025 | 11:02 AM

మన దేశానికి స్వాతంత్యం వచ్చిన ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఉత్సాహం, దేశభక్తితో నిండిన రోజు. ఈ రోజు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేసే పండుగ మాత్రమే కాదు.. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే రోజు. ఈ ప్రత్యేక రోజున పిల్లలు తినే ప్లేట్‌ను త్రివర్ణ పతాక రంగులతో అలంకరిస్తే.. ఆహారంలోని రుచి దేశభక్తి అనే భావనతో మనసులోకి మరింత లోతుగా చేరుకుంటుంది. స్కూల్, ఆఫీస్ లేదా ఇంట్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యేకంగా చేసుకోవలనుకుంటే త్రివర్ణ థీమ్‌పై తయారుచేసిన వంటకాలు గొప్ప ఎంపిక. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి.

త్రివర్ణ శాండ్‌విచ్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్కూల్ త్వరగా ముగుస్తుంది. కనుక మీ పిల్లలకు వారి టిఫిన్‌లో త్రివర్ణ శాండ్‌విచ్ ఇవ్వవచ్చు. ఇందులో గ్రీన్ చట్నీ (ఆకుపచ్చ రంగు), క్రీమ్ లేదా చీజ్ (తెలుపు రంగు), టొమాటో సాస్ (కుంకుమ రంగు) మూడు రుచికరమైన పొరలను ఏర్పాటు చేసి ఇవ్వండి. ఇలా మూడు రంగుల్లో కనిపించే త్రివర్ణ శాండ్‌విచ్ ను పిల్లలు, పెద్దలు ఇద్దరూ చాలా ఇష్టంగా తింటారు. అందుకనే పిల్లలకి టిఫిన్ బాక్స్ ఇవ్వడంతో పాటు దీన్ని ఇంట్లో కూడా అందించవచ్చు.

త్రివర్ణ పులావ్ : భోజనం కోసం ప్రత్యేకమైన , రంగురంగుల వంటకం వడ్డించాలనుకుంటే ఖచ్చితంగా త్రివర్ణ పులావ్ తయారు చేసుకోండి. దీనిలో పచ్చి బఠానీలు, కొత్తిమీరతో ఆకుపచ్చ రంగును, బియ్యం తో తెలుపు రంగును, పసుపు క్యారెట్ల మిశ్రమంతో కుంకుమ రంగును తయారు చేయవచ్చు. త్రివర్ణ పులావ్ రుచితో పాటు అందమైన లుక్ ని కూడా ఇస్తుంది. చాలా రుచికరంగా ఉంటుంది.

త్రివర్ణ ధోక్లా: ఈ ప్రసిద్ధ గుజరాతీ వంటకం భారతీయ త్రివర్ణ పతాకం రంగులతో అలంకరించబడి సరదాగా ఉంటుంది. సాదా శనగపిండి, పాలకూర, టమోటా ప్యూరీ మూడు పొరలు ఈ ధోక్లాను రుచి, దేశభక్తితో నింపుతాయి. ఇది అల్పాహారం లేదా పార్టీ స్నాక్‌కి ఉత్తమ ఎంపిక. దీనితో పాటు గ్రీన్ చట్నీని తప్పకుండా వడ్డించండి.

త్రివర్ణ ఫ్రూట్ సలాడ్: వివిధ రకాల పండ్లను ఉపయోగించి మూడు రంగులు ప్రతిబింబించేలా ఫ్రూట్ సలాడ్ తయారు చేయవచ్చు నారింజ, అరటి, కివి పండ్లను ఉపయోగించి త్రివర్ణ ఫ్రూట్ సలాడ్ ని తయారు చేసి పిల్లలకు అందించవచ్చు.

త్రివర్ణ కోకోనట్ బర్ఫీ: స్వీట్లు లేకుండా ఏ పండుగ అయినా అసంపూర్ణమే. ఈ కొబ్బరి బర్ఫీ ఆకుపచ్చ, తెలుపు , కుంకుమ రంగులలో అలంకరించబడి ఉంటుంది. ఇది అందంగా కనిపించడమే కాదు ప్రతి ముక్కలోనూ స్వాతంత్ర్య దినోత్సవ మాధుర్యం నిండి ఉంటుంది.

త్రివర్ణ పాస్తా: పిల్లల కోసం ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటే ట్రైకలర్ పాస్తాను ప్రయత్నించండి. ఇందులో పాలకూర సాస్‌తో ఆకుపచ్చ పాస్తాను, క్రీమ్ సాస్‌తో తెలుపు , టమోటా-ఉల్లిపాయ సాస్‌తో కుంకుమపువ్వు రంగుని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ వంటకం దేశ రంగుల్లో విదేశీ రుచిని మేళవిస్తుంది.




