AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఆకులను ప్రతి రోజు 2 తింటే చాలు.. దెబ్బకు ఆ సమస్యలన్నీ ఫసక్

బిల్వపత్ర ఆకులను కేవలం పూజలకు మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బిల్వపత్ర ఆకుల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం, జ్వరాలు, గుండె సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు అంటున్నారు.

Health Tips: ఈ ఆకులను ప్రతి రోజు 2 తింటే చాలు.. దెబ్బకు ఆ సమస్యలన్నీ ఫసక్
Bilva Patra
Krishna S
|

Updated on: Aug 12, 2025 | 10:38 AM

Share

బిల్వ పత్రం (మారేడు ఆకు) అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది చర్మ సమస్యలను నయం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. బిల్పత్ర ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను రోజూ తింటే అనేక రోగాల నుండి రక్షణ పొందవచ్చు.

జీర్ణక్రియ మెరుగుదల: ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. బిల్వపత్ర ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇవి కడుపులో వాత, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మధుమేహం నియంత్రణ:
బిల్వ పత్రంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం ఉంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

మలబద్ధకం నివారణ:

బిల్వపత్ర ఆకులలోని ఫైబర్, శ్లేష్మం వంటి పదార్థాలు మలాన్ని మృదువుగా చేసి, పేగుల కదలికను సులభతరం చేస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక మలబద్ధకం తగ్గుతుంది. ప్రతిరోజూ ఈ ఆకులను నమలడం వల్ల ప్రేగులలో పేరుకుపోయిన పాత మలినాలు కూడా తొలగిపోతాయి.

రోగనిరోధక శక్తి :

ఈ ఆకులు రోగనిరోధక శక్తిని పెంచి, జ్వరాలు, ముఖ్యంగా మలేరియా, వైరల్ జ్వరాల నుండి రక్షణ కల్పిస్తాయి. మారుతున్న వాతావరణంలో ఈ ఆకుల కషాయం తాగడం వల్ల జ్వరాల బారినుంచి కాపాడుకోవచ్చు.

గుండె ఆరోగ్యం:

ఆయుర్వేదం ప్రకారం.. బిల్వపత్ర ఆకులు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.

ఎలా వాడాలి?

బిల్వపత్ర ఆకులను శుభ్రం చేసి ఎండబెట్టి పొడి చేసి తీసుకోవచ్చు. లేదా కషాయంలా తయారుచేసుకుని తాగవచ్చు. ప్రతిరోజూ 5-10 మి.లీ ఆకుల రసం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేడి నీటితో ఆకుల పొడిని కలిపి కూడా తాగవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..