AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి వరం ఈ మొక్క.. చెవి సమస్యలతో సహా అనేక వ్యాధులకు బెస్ట్ మెడిసిన్.. ఎలుక చెవి ఆకు..

ప్రకృతే ఒక వైద్య శాల. మొక్కలే ఒక దివ్య ఔషధాలు.. పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అని కొన్ని రకాల మొక్కలను పట్టికోకుము. అయితే వీటిల్లో కూడా అనేక ఔషధ గుణాలు ఉంటాయని.. అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని మన ఆయుర్వేదం చెబుతోంది. అలా ప్రకృతి ప్రసాదిత మొక్కలలో ఎలుక చెవి ఆకు ఒకటి. ఈ మొక్క నరాల జబ్బులతో సహా అనేక రకాల సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ప్రకృతి వరం ఈ మొక్క.. చెవి సమస్యలతో సహా అనేక వ్యాధులకు బెస్ట్ మెడిసిన్.. ఎలుక చెవి ఆకు..
Eluka Chevi Leaf
Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 5:14 PM

Share

ప్రకృతి మానవుని ఇచ్చిన ఓ వరం మొక్కలు. ఈ మొక్కలలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలున్నాయి. అటువంటి మొక్కలలో ఒకటి. ఎలుక చెవి ఆకు మొక్క. దీనిని సంస్కృతంలో మూషిక కర్ణి అని అంటారు. దీని శాస్త్రీయ నామం పెపెరోమియా పెల్లుసిడా. ఈ మొక్క ఆకులు చూడడానికి ఎలుక చెవి ఆకారంలో కనిపిస్తాయి. కనుక ఆ పేరు వచ్చింది. ఇది తీగాలా పాకుతుంది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. దీనిని సాంప్రదాయ , ఆయుర్వేద వైద్యంలో నరాల సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కోసం కఫం, పైత్యం, చెవిపోటు వంటి సమస్యల నివారణకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా నరాల వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటారు. అంతేకాదు వీటి ఆకులు కఫ, పైత్యం (పిత్త దోషం) తగ్గించడంలో సహాయపడతాయని భోజన కుతూహలం గ్రంథంలో పేర్కొంది. అంతేకాదు చెవిపోటు, చెవినొప్పి నివారణతో పాటు ఉబ్బసం, కడుపు నొప్పి, అలసట వంటి ఇతర సమస్యలకు కూడా ఉపయోగపడుతుందని పలు సాంప్రదాయ వైద్య గ్రంథాలు పేర్కొన్నాయి.

ఎలుక చెవి ఆకులు శరీరంలోపల ఉండే వాపుల నుంచి ఉపశమనం ఇస్తాయి. అంతేకాదు కీళ్ళ నొప్పులకు బెస్ట్ మెడిసిన్ అని కూడా చెబుతున్నారు.

మైగ్రేన్ తో ఉపశమనాన్ని ఇస్తాయి. కడుపులో నులిపురుగు, పేగుల్లో పెరిగే ఎలికపాముల సమస్యతో బాధపడేవారికి మంచి మెడిసిన్.

ఇవి కూడా చదవండి

నేటికీ కొన్ని ఆటవిక జాతుల వారు వీటి ఆకులను ఎలుక కరిస్తే విరుగుడుగా ఈ ఆకులను వినియోగిస్తారు.

మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఫిట్స్‌ వంటి నరాల జబ్బులకు బెస్ట్ మెడిసిన్.

షుగర్ పేషెంట్స్ ఈ ఆకుల కషాయం రోజూ తాగడం వలన మధుమేహం అదుపులో ఉంటుంది.

చెవి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుంటే.. ఈ ఆకుల రసంలో అదే పరిమాణంలో నువ్వుల నూనె కలిపి.. ఈ మిశ్రాన్ని కొంచెం వేడి చేసి చెవిలో వేస్తె.. చెవి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఉబ్బసం, ఆయాసం, కఫం వంటి సమస్యతో తరచుగా బాధపడుతుంటే.. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారికి ఈ ఆ కుల కషాయం ఔషధంలా పనిచేస్తుంది.

ఎలుక చెవి ఆకును ఎలా ఉపయోగించాలంటే

తీగ నుంచి ఆకులను కట్ చేసి బాగా కడిగి శుభ్రంగా చేసుకోవాలి. ఆకులను దంచి రసం తీసుకోవాలి. ఈ కషాయం తాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)