AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు చిన్నారులకు ఒకేసారి కడుపునొప్పి..! స్కానింగ్‌ చేసిన వైద్యులు షాక్‌.. రిపోర్ట్‌లో ఏముందంటే..

ఆ కారణంగా పిల్లల పేగులు కూడా కరిగిపోయాయని చెప్పారు. శస్త్రచికిత్స ద్వారా వైద్యం అందించినట్టుగా చెప్పారు. ఈ ఆపరేషన్‌ చాలా క్లిష్టమైనదిగా చెప్పారు. కానీ, ఇద్దరు పిల్లల పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. దాదాపు రెండు వారాల సంరక్షణ తర్వాత, వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

ఇద్దరు చిన్నారులకు ఒకేసారి కడుపునొప్పి..! స్కానింగ్‌ చేసిన వైద్యులు షాక్‌.. రిపోర్ట్‌లో ఏముందంటే..
Kids Swallowed 16 Magnets
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2025 | 4:45 PM

Share

పిల్లలు ఆడుకునేటప్పుడు తరచుగా నాణేలు, చిన్న చిన్న వస్తువులు, అయస్కాంతాలు మొదలైన వాటిని నోటిలో పెట్టుకుని మింగేస్తుంటారు. అది పిల్లలతో పాటుగా తల్లిదండ్రులను బాధపెట్టేదిగా మారుతుంది. కొన్నిసార్లు అలాంటివి గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాంతకం కూడా కావచ్చు. మధుర నుండి ఇలాంటి ప్రమాదకరమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మూడూ, నాలుగు సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులు చిన్న అయస్కాంతాలను మింగారు. దాంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు పిల్లలకు కడుపులో పురుగులు ఉండవచ్చని భావించారు. కానీ, పిల్లలకు అదే పనిగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యారు. దాంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌ చేసిన వైద్యులు చిన్నారుల కడుపులో ఒకరికి10 అయస్కాంతాలు, మరొకరి పొట్టలో 6 అయస్కాంతాలు ఉన్నట్టుగా గుర్తించారు. అయస్కాంతాలు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. దీని వలన పిల్లల ప్రేగులలో తీవ్రమైన సమస్యలు ఏర్పడ్డాయి.

పీడియాట్రిక్ సర్జరీ సీనియర్ వైద్యుడు నితిన్ జైన్ మాట్లాడుతూ.. సాధారణంగా పిల్లలు అయస్కాంతం లేదా బటన్‌ను మింగేస్తారని, కానీ ఈ కేసు భిన్నంగా, చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఇద్దరు పిల్లల కడుపులలో చాలా అయస్కాంతాలు కలిసిపోయాయి. అయస్కాంతాల కారణంగా పిల్లల పేగులు కూడా కరిగిపోయాయని చెప్పారు. శస్త్రచికిత్స ద్వారా వైద్యం అందించినట్టుగా చెప్పారు. ఈ ఆపరేషన్‌ చాలా క్లిష్టమైనదిగా చెప్పారు. కానీ, ఇద్దరు పిల్లల పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. దాదాపు రెండు వారాల సంరక్షణ తర్వాత, వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

ఎవరైనా అనుకోకుండా అయస్కాంతాన్ని మింగితే, వెంటనే అప్రమత్తంగా ఉండాలని NCBI అధ్యయనం ( ref .) పేర్కొంది. ఇది అత్యవసర వైద్య పరిస్థితి. అలాంటి సందర్భాలలో ఆలస్యం ప్రమాదకరం. అయస్కాంతం కడుపు లేదా ప్రేగులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి, ఆలస్యం చేయకుండా పిల్లవాడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రేగులలో రక్తం లేకపోవడం వల్ల అయస్కాంతం అంటుకుపోతుంది. దాంతో చుట్టుపక్కల ఉన్న సిరల నుండి రక్తం ఆగిపోతుంది. అయస్కాంతం పేగును గుచ్చుకోవచ్చు, అవయవాల మధ్య అసాధారణ మార్గాలను సృష్టించవచ్చు. కాబట్టి చిల్లులు లేదా ఫిస్టులా ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయస్కాంతం ద్వారా ప్రేగులలో అడ్డు ఏర్పడుతుంది. సకాలంలో చికిత్స పొందకపోతే శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..