ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లాలోని మినుములూరు, అరకులో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి, పాడేరులలో 6 డిగ్రీలు ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.