AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో..పోలీసులు ఇట్ల కూడా ఇరికిస్తరా…? తప్పు చేసిన పోలీసులు అట్లా దొరికిపోయారు

మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 6 మంది పోలీసులు బస్సులో నుంచి యువకుడిని కిడ్నాప్ చేసి, నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికించిన ఘటన నెట్టింట కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఘటనతో పోలీసులు...

Viral Video: వామ్మో..పోలీసులు ఇట్ల కూడా ఇరికిస్తరా...? తప్పు చేసిన పోలీసులు అట్లా దొరికిపోయారు
Police Fake Drugs
K Sammaiah
|

Updated on: Dec 13, 2025 | 4:59 PM

Share

మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మల్హర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన 6 మంది పోలీసులు బస్సులో నుంచి యువకుడిని కిడ్నాప్ చేసి, నకిలీ డ్రగ్స్ కేసులో ఇరికించిన ఘటన నెట్టింట కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఘటనతో పోలీసులు పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారని నెటిజన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

మల్హర్‌గడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 18 ఏళ్ల విద్యార్థిని పోలీసులే కిడ్నాప్ చేసి, నల్లమందు స్మగ్లింగ్ కేసులో ఇరికించారు. ఈ ఘటన వైరల్‌ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 2.7 కిలోల డ్రగ్స్‌ కలిగి ఉన్నాడనే ఆరోపణలపై సోహన్‌లాల్ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నాలుగు నెలల తర్వాత, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇందూర్ బెంచ్‌లో జరిగిన విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తాము అతడిని సాయంత్రం 5 గంటలకు బందా ఖల్ సమీపంలో అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. కానీ, కోర్టుకు సమర్పించిన సీసీటీవీ ఫుటేజీలో సాదా దుస్తులు ధరించిన వ్యక్తులు, మల్హర్‌గఢ్ పోలీసులుగా గుర్తించబడిన వారు, ఉదయం 11:39 గంటలకు అతడిని బస్సులో నుంచి లాగిపడేయడం కనిపించింది.

ఎఫ్‌ఐఆర్ వీడియోలో రికార్డ్ అయిన అసలు సమయం, ప్రదేశంతో సరిపోలడం లేదని మందసౌర్ ఎస్పీ వినోద్ కుమార్ మీనా అంగీకరించారు. ఇది మొత్తం దర్యాప్తు చట్టబద్ధతను కోర్టు ప్రశ్నించడానికి, శాఖాపరమైన చర్యలకు దారితీసింది.

వీడియో చూడండి: