Viral Video: అదేంది బ్రో.. వాళ్లు అసలు విద్యార్థులేనా? నడిరోడ్డు మీద మహిళను ఎలా కొట్టారో చూడండి
ఉత్తరప్రదేశ్ అంటేనే అరాచకాలక కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుంటారు. నడి రోడ్డు మీద నరికేయడాలు అక్కడ కొత్తేమీ కాదు. తాజాగా ఒక రోడ్డు మీద జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ విద్యార్థుల బృందం ఒక మహిళ వ్యాపార భాగస్వామిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వేధింపులను నిరసించినందుకు వాహనాన్ని...

ఉత్తరప్రదేశ్ అంటేనే అరాచకాలక కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుంటారు. నడి రోడ్డు మీద నరికేయడాలు అక్కడ కొత్తేమీ కాదు. తాజాగా ఒక రోడ్డు మీద జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ విద్యార్థుల బృందం ఒక మహిళ వ్యాపార భాగస్వామిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వేధింపులను నిరసించినందుకు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన డిసెంబర్ 9, మంగళవారం నాడు మీరట్‌లోని సదర్ బజార్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మీరట్ పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు, అయితే పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు. మీరట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రధాన నిందితుడు ముకుల్ త్యాగిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులు త్యాగి స్నేహితులైన ధ్రువ్, దక్ష్, ఆదిత్యలను కూడా అరెస్టు చేశారు.
నిందితులు ఎల్ఎల్‌బి విద్యార్థులుగా గుర్తించారు. రోడ్డు గొడవ సమయంలో వారు మహిళను వేధించినట్లు పోలీసులు తెలిపారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. నడి రోడ్డు మీద మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
From the capital of lawlessness -Meerut, UP
A woman was being harassed by goons. When her brother protested, the goons attacked, terrorised and vandalised victim’s car in the middle of a busy road in the city. pic.twitter.com/zaRGO63pJd
— Piyush Rai (@Benarasiyaa) December 11, 2025
