Viral Video: ఎంతకు తెగించార్రా..ఉద్దెరకు సిగరెట్లు ఇవ్వనందుకు.. దుకాణదారుడిపై కర్రలతో దాడి చేసిన ముఠా
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని గద్రౌలి గ్రామంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అరువుకు సిగరెట్లు ఇవ్వనందుకు ఓ దుకానదారుడిపై ముఠా మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుగా సిగరెట్లు ఇవ్వడానికి నిరాకరించడంపై జరిగిన ఒక చిన్న...

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని గద్రౌలి గ్రామంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అరువుకు సిగరెట్లు ఇవ్వనందుకు ఓ దుకానదారుడిపై ముఠా మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పుగా సిగరెట్లు ఇవ్వడానికి నిరాకరించడంపై జరిగిన ఒక చిన్న వివాదం క్రూరమైన వీధి హింసకు దారితీసింది.
వైరల్ అవుతున్న ఒక వీడియోలో నలుగురు యువకులు ఒక దుకాణదారుడిని ప్రధాన రహదారిపైకి ఈడ్చుకెళ్లి కర్రలు, రాడ్లతో కొట్టడం కనిపిస్తుంది. రాహుల్ శుక్లా నేతృత్వంలోని ఆ వ్యక్తులు, బాధితుడు అప్పుగా సిగరెట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో దుర్భాషలాడటం ప్రారంభించారని, ఆ తర్వాత మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో దుకాణదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఠాలోని వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
पिटने वाले युवक का कसूर सिर्फ इतना था कि उसने उधार पर सिगरेट देने से इंकार कर दिया, मामला ग्वालियर का है … pic.twitter.com/paOBtrj5Q9
— Anurag Dwary (@Anurag_Dwary) December 10, 2025
