Watch: వామ్మో.. రెస్క్యూ టీంపై దాడికి దిగిన కింగ్ కోబ్రా.. త్రుటిలో తప్పిన ప్రమాదం
దాని పరిమాణాన్ని చూసి ప్రజలు భయపడ్డారు. డెహ్రాడూన్‌లోని భావులా ప్రాంతంలోని ఒక ఇంటి దగ్గర ఉన్న చెట్లపై ఈ పాము కనిపించింది. స్థానికులు వెంటనే అటవీ శాఖలోని ఝజ్రా రేంజ్‌కు సమాచారం అందించారు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద పాము తిరుగుతోందని, అది ఎవరికైనా ప్రమాదకరంగా మారవచ్చని ఆ శాఖకు వెల్లడించారు.

అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను పట్టుకునే క్రమంలో రెస్క్యూ బృందం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. డెహ్రాడూన్‌లోని భావువాలా గ్రామంలో పొడవైన కింగ్ కోబ్రా స్థానికులకు కనిపించింది. భారీ ఆకారంలో ఉన్న కింగ్ కోబ్రా స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. దానిని చూసిన వారందరూ షాక్ అయ్యారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. కానీ, ఎంత ప్రయత్నించిన వారు ఈ విషపూరిత పామును నియంత్రించలేకపోయారు. దాంతో ఆ శాఖకు చెందిన క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్‌టి)ని పిలిపించారు. వారు 14 అడుగుల పొడవైన అత్యంత ప్రమాదకర పామును ధైర్యంగా పట్టుకున్నారు.
అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణించబడే కింగ్ కోబ్రా ఉనికి భావులా ప్రాంతంలోని ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా మారడమే కాకుండా, దాని పరిమాణాన్ని చూసి ప్రజలు భయపడ్డారు. డెహ్రాడూన్‌లోని భావులా ప్రాంతంలోని ఒక ఇంటి దగ్గర ఉన్న చెట్లపై ఈ పాము కనిపించింది. స్థానికులు వెంటనే అటవీ శాఖలోని ఝజ్రా రేంజ్‌కు సమాచారం అందించారు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద పాము తిరుగుతోందని, అది ఎవరికైనా ప్రమాదకరంగా మారవచ్చని ఆ శాఖకు వెల్లడించారు.
వీడియో ఇక్కడ చూడండి..
సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం సభ్యులు ఘటనా స్థలికి వెళ్లారు. పామును పట్టుకునే క్రమంలో అది వారిపై దాడికి దిగింది. దీంతో తక్షణమే అప్రమత్తమై దాడి నుంచి తప్పించుకున్నారు. అనంతరం అతి కష్టం మీద పామును పట్టుకున్నారు. ఇది దాదాపు 14 అడుగుల పొడవు, దాదాపు 10 కిలోల బరువు కలిగి ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




