AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి భార్యను హింసించి, రెండో భార్యను చంపేసి.. జైలు నుంచి వచ్చి మూడో పెళ్లి..! సీన్ కట్‌చేస్తే..

ఓ వ్యక్తి జైలు నుంచి వచ్చిన కొన్ని రోజులకే మూడో పెళ్లి చేసుకుని ఆమెను హత్య చేశాడు. సదరు వ్యక్తి మొదటి భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్న అతడు, ఆమెను చంపి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక మూడో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఆమెను కూడా హత్య చేశాడు. హత్య జరిగినప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి..

మొదటి భార్యను హింసించి, రెండో భార్యను చంపేసి.. జైలు నుంచి వచ్చి మూడో పెళ్లి..! సీన్ కట్‌చేస్తే..
Man Kills Third Wife
Jyothi Gadda
|

Updated on: Aug 31, 2025 | 8:04 AM

Share

బీహార్‌లోని దర్భాంగా జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. బిహార్‌లోని దర్భాంగాలో ఒక వ్యక్తి జైలు నుంచి వచ్చిన కొన్ని రోజులకే మూడో పెళ్లి చేసుకుని ఆమెను హత్య చేశాడు. సదరు వ్యక్తి మొదటి భార్య అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్న అతడు, ఆమెను చంపి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక మూడో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఆమెను కూడా హత్య చేశాడు. హత్య జరిగినప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు.

ఈ సంఘటన దర్భంగాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ బేలా గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం ఆగస్టు 26 రాత్రి ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి నిద్రిస్తున్న తన భార్యపై పదునైన ఇనుప వస్తువుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె నెత్తుటి మడుగులో పడివుండగానే అతడు దాడి చేసిన వస్తువుతో అక్కడి నుండి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన విభను కుటుంబ సభ్యులు దర్భాంగా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (DMCH)లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పాట్నాకు రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విభ మరణించింది.

మృతురాలి తండ్రి సదర్ పోలీస్ స్టేషన్‌లో తన అల్లుడు ప్రమోద్ పాశ్వాన్‌పై వరకట్న వేధింపులు, హత్య ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. పెళ్లైన కొద్ది రోజులకే ప్రమోద్ తన కూతురిపై కట్నం కోసం దాడి చేసేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, పోలీసుల దర్యాప్తులో ప్రమోద్ పాశ్వాన్ కు చాలా కాలంగా చరిత్ర ఉందని తేలింది. అతని చిత్రహింసలు భరించలేక మొదటి భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. 2019లో అతను రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను రెండవ భార్యను గొంతు కోసి చంపాడు. ఆ కేసులో అతను జైలుకు వెళ్లాడు. ఇటీవలె బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత, అతను మూడవ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే మూడవ భార్యను కూడా హత్య చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన జరిగినప్పటి నుండి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమోద్ మానసిక స్థితి మొదటి నుండి విచిత్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
ఓరీ దేవుడో.. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ అద్దె నెలకు రూ. 8 ల‌క్ష‌లు..
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ప్రభుత్వ సాయంతో రూ.50 వేలు
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అతిగా తాగేస్తున్నారా?
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అసలు కారణం ఇదే కావచ్చు!
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చిన్నప్పటి నుంచే నత్తి.. పాన్ ఇండియాను షేక్ చేసిన హీరో..
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
చలితో ఇబ్బందా.. ఈ సింపుల్‌ టిప్స్‌తో శరీరానికి వెచ్చదనం
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
ప్రభాస్ జోకర్ గెటప్ వెనకున్నది దర్శకుడు మారుతీ కాదట.!
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా