హైదరాబాద్ నగరంలో వెలసిన అమర్నాథ్ మంచులింగ గణేశుడు..! భారీగా క్యూ కట్టిన భక్తులు.. ఎక్కడంటే..
మండపానికి కుడివైపున కాశీవిశ్వ నాథుడు, భీమశంకర, మల్లికార్జునస్వామి, సోమనాథుడి, కేదార్నాథ్, అమర్నాథ్, ఘృష్టేశ్వర, త్రయంబ కేశ్వర్, నాగేశ్వర్, రామేశ్వరం, వైద్యనాథ్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ వంటి 12 జ్యోతిర్లింగాలను, త్రిమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎడమవైపు అమర్నాథ్ సెట్టింగ్ ఏర్పాటుచేసి అందులో మంచు లింగం నిర్మించారు.

వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. వీధివీధినా ఏర్పాటుచేసిన మండపాల్లో రకరకాల గణనాథులు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గణేష్ నవరాత్రులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ముంబయ్, ఆ తరువాత హైదరాబాద్ అని చెప్పాలి. ఎందుకంటే.. హైదరాబాద్‌లో వీధుల్లో అనేక వినూత్న రీతుల్లో గణపతి మండపాలు, వెరైటీ వెరైటీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు నిర్వాహకులు. ఈ యేడు రాంనగర్ టీఆర్టీ కాలనీలో ఏర్పాటు చేసిన అమర్నాథ్ మంచులింగం సెట్టింగ్ తో భారీ వినాయక మండపం నిర్మించారు. ఇక్కడి ఏర్పాట్లు చూసేందుకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు.
ఇక్కడ మంచులింగంతో పాటు 12 జ్యోతిర్లింగాలతో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మంచులింగం, జ్యోతిర్లింగాలను చూడటానికి తండోపతండాలుగా భక్తులు రావడంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికశోభసంతరించుకుంది. మండపానికి కుడివైపున కాశీవిశ్వ నాథుడు, భీమశంకర, మల్లికార్జునస్వామి, సోమనాథుడి, కేదార్నాథ్, అమర్నాథ్, ఘృష్టేశ్వర, త్రయంబ కేశ్వర్, నాగేశ్వర్, రామేశ్వరం, వైద్యనాథ్, ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ వంటి 12 జ్యోతిర్లింగాలను, త్రిమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎడమవైపు అమర్నాథ్ సెట్టింగ్ ఏర్పాటుచేసి అందులో మంచు లింగం నిర్మించారు.
వీడియో ఇక్కడ చూడండి..
టీఆర్డీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గత 63 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నర్సింహులు తెలిపారు. ప్రతీ సంవత్సరం ఒక వెరైటీ మండపాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 20 లక్షల వ్యయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




