Telangana Assembly: బిగ్ డే.. పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజుకు చేరాయి. అధికార కాంగ్రెస్ ఇవాళ్టి సెషన్‌ను బిగ్ డేగా భావిస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం అనంతరం.. కాళేశ్వరం నివేదికను సభలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ముందుగా ప్రభుత్వం, పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ, బీసీలకు 42%రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం.. బిల్లులను సభ ఆమోదించింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండురోజు ప్రారంభమయ్యాయి.. ముందుగా ప్రభుత్వం, పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ, బీసీలకు 42%రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం.. పంచాయతీ, మున్సిపల్ చట్టసవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. మున్సిపాల్టీలలో బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్ చట్టసవరణ చేశారు. గత మున్సిపల్ చట్టంలో ఉన్న 50శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ని ఎత్తివేస్తూ ప్రభుత్వం మున్సిపల్ చట్టసవరణ బిల్లును తీసుకు వచ్చింది.
మధ్యాహ్నం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సభలో ప్రవేశ పెట్టి.. చర్చించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అయితే ఇవాళ్టి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే అవకాశం ఉంది. మొదట బీసీ బిల్లు పై చర్చ జరగగా.. అనతంరం మధ్యాహ్నం నుంచి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను ప్రవేశపెట్టనుంది.
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

