Telangana: వాటే టెక్నలాజియా.. బాసరలో కార్లు కొట్టుకుపోకుండా ఏం చేశారంటే..
బాసరలో వర్షబీభత్సం, వరద విలయం ఎలా ఉందో చెప్పే దృశ్యం మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. వరదలకు తమ కార్లు కొట్టుకుపోతాయని భావించిన కొందరు, ఆ కార్లను తమ ఇళ్లల్లోనే పెట్టి తాళ్లతో కట్టారు. ఆ కార్ల బ్యానెట్ మీద వరకు వరద పోటెత్తినట్లు అక్కడి దృశ్యం చెబుతోంది.
వర్షం తగ్గింది. వరద ఆగింది. కానీ ఇళ్ల నిండా బురద మిగిలింది. జనం బతుకుల్లో కష్టాలు కన్నీళ్లు మిగిల్చింది. వరద బురదతో ఆదిలాబాద్‌లోని బాసర అతలాకుతామైంది.. వరద ప్రవాహంతో అతలాకుతలమైన బాసర ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా బాసరలో అనేక కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లల్లోని వస్తువులు తడిచిపోయాయి. గోదావరి వరద పోటెత్తడంతో వాహనాలు కూడా నీట మునిగాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో వరదలో కార్లు కొట్టుకుపోకుండా ముందు జాగ్రత్తగా తాడుతో కట్టారు.
బాసరలో వర్షబీభత్సం, వరద విలయం ఎలా ఉందో చెప్పే దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.. వరదలకు తమ కార్లు కొట్టుకుపోతాయని భావించిన కొందరు, ఆ కార్లను తమ ఇళ్లల్లోనే పెట్టి తాళ్లతో కట్టారు. కారు బానెట్ నుంచి తాడును కిటీకీలకు కట్టారు. ఆ కార్ల బ్యానెట్ మీద వరకు వరద పోటెత్తినట్లు అక్కడి దృశ్యం చెబుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

