AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కామారెడ్డిలో విష సర్పాల సంచారం..! ఎలా పడగ విప్పి చూస్తున్నాయో తెలిస్తే..

చుట్టూ వరద ఉధృతి కొనసాగుతుండగా, ఎత్తుగా ఉన్న గోడపై కూర్చుని ఉన్న ఆ నాగుపాము ఎటూ కదలకుండా చాలా సేపు బ్రిడ్జీ మీదనే ఉండిపోయింది. అది గమనించిన స్థానికులు కొందరు ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయారు. మరికొందరు ఆ పామును తమ సెల్‌ఫోన్లతో వీడియో రికార్డ్‌ చేశారు. అదే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

Watch: కామారెడ్డిలో విష సర్పాల సంచారం..! ఎలా పడగ విప్పి చూస్తున్నాయో తెలిస్తే..
Cobra Snake On Bridge
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2025 | 12:05 PM

Share

భారీ వర్షాలకు కామారెడ్డి వణికిపోయింది. జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ చూడని అతి భారీ వర్షం ఇక్కడ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షం, వరదలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా 24గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు పొంగిపోర్లాయి. అనేక చోట్ల చెరువులకు గండిపడి ఊర్లకు ఊర్లను ముంచేశాయి. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భంలో ఇరుక్కుపోయాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. పలుచోట్ల వరదనీటిలో కార్లు, మూగజీవాలు, మనుషులుకూడా కొట్టుకునిపోయిన అనేక వీడియోలు వైరల్ గా మారాయి. అలాంటిదే ఈ వీడియో కూడా

కామారెడ్డి వరదలకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో కామారెడ్డిలోని ఒక బ్రిడ్జీ వద్ద నాగు పాము పడగ విప్పీ మరీ కూర్చుని ఉండటం కనిపించింది. చుట్టూ వరద ఉధృతి కొనసాగుతుండగా, ఎత్తుగా ఉన్న గోడపై కూర్చుని ఉన్న ఆ నాగుపాము ఎటూ కదలకుండా చాలా సేపు బ్రిడ్జీ మీదనే ఉండిపోయింది. అది గమనించిన స్థానికులు కొందరు ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయారు. మరికొందరు ఆ పామును తమ సెల్‌ఫోన్లతో వీడియో రికార్డ్‌ చేశారు. అదే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది దీనిపై తీవ్రంగా స్పందించారు. కొందరు దాని రక్షణ కోసం ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు బాబోయ్ డేంజర్ అంటూ భయాందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి వీడియో మాత్రం వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
మొసలి తుమ్మితే ఎట్టా ఉంటదో తెలుసా..? ఈ వీడియో చూస్తే..
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
సమ్మర్ లో కోడిగుడ్లు తినవచ్చా?నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు