Photo Puzzle: ఈ ఫోటోలోని నెంబర్ ఏంటో చెప్పగలరా.? 5 సెకన్లలో కనిపెడితే మీరే తెలివైనవారు
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్. తెలివైనవారిని కూడా ఇవి మడతపెట్టేస్తున్నాయ్. మరి మీరు కూడా పజిల్స్ సాల్వ్ చేయడంలో సిద్దహస్తులైతే.. ఓ సారి ఈ ఫోటో పజిల్ పై లుక్కేయండి. సమాధానం ఏంటో ఈజీగా చెప్పెసేయండి.

ఆప్టికల్ ఇల్యూషన్.. ఈ ఫోటోలు నెట్టింట కోకొల్లలు. పైకి కనిపించేది ఒకటి లోపల ఉన్నది మరొకటి. అలా చూసేవారిని మభ్యపెట్టే ఈ చిత్రాలను సాల్వ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కొంచెం మీ బుర్రకు పదునుపెట్టి.. మీ కళ్లకు పని చెప్తే ఈజీగా సమాధానం కనుక్కోగలరు. మరి మీకు కూడా ఇలాంటి ఫోటో పజిల్స్ సాల్వ్ చేయడంలో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లయితే.. ఓసారి పైన పేర్కొన్న ఫోటోను చూసేయండి. పై ఫోటోలో మీరు బ్లాక్ అండ్ వైట్ లైన్స్ చూడొచ్చు. ఇక ఆ లైన్స్ మధ్య ఓ నెంబర్ దాగి ఉంది. కనిపించి.. కనిపించనట్టు.. అది మిమ్మల్ని తికమక పెట్టేస్తుంది. మరి ఆ నెంబర్ ఏంటో మీరు గుర్తించాలి. 99 శాతం తెలివైనవారు ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. కొందరేమో ఈ ఫోటోలో ఉన్నది ‘528’ నెంబర్ అని చెప్తే.. ఇంకొందరు ఈ ఫోటోలో ఉన్నది ‘683’ అని కామెంట్ చేశారు. పైగా వాళ్లు చెప్పిన సమాధానం కూడా తప్పే. ఒకవేళ మీరు కూడా ఈ ఫోటోలో దాగున్న నెంబర్ చెప్పలేకపోతే.. టెన్షన్ వద్దు.. ఆన్సర్ దిగువన మేము ఇచ్చేస్తాం. కానీ ఒకసారి మీరూ కనిపెట్టడానికి ప్రయత్నించండి.
సరే మీరు ఎంత ట్రై చేసినా.. ఈ చిత్రంలో దాగి ఉన్న సంఖ్యను చెప్పలేకపోతే,మేము మీకు ఆ నెంబర్ ఏంటో చెప్పేస్తున్నాం. ఈ చిత్రంలో దాగి ఉన్న సంఖ్య 3452839. ఆ సంఖ్య దగ్గరగా మీరు కనిపెడితే.. మీకు హ్యాట్సాఫ్..! మళ్ళీ మరో పజిల్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటిదాకా టాటా.. బైబై.. అల్విదా..!
