AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake in Crocs: బూట్లలో ఉన్న పాము కరిచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి.. స్పాట్ లోనే చనిపోయిన పాము

బెంగళూరులో చాలా విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాము కాటు కారణంగా మరణించాడు. అంతేకాదు ఇంజనీర్ ని కాటు చేసిన పాము కూడా మరణించింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తికి కాలు తిమ్మిరి సమస్య ఉంది. దీంతో అతనికి అసలు పాము కాటు వేసినట్లు తెలియలేదు.

Snake in Crocs: బూట్లలో ఉన్న పాము కరిచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి.. స్పాట్ లోనే చనిపోయిన పాము
Snake In Crocs Bangalore
Surya Kala
|

Updated on: Sep 01, 2025 | 12:27 PM

Share

వర్షాకాలంలో పాములు, తేళ్లు వంటి విషపూరిత జీవులు బొరియల నుంచి బయటకు రావడం సర్వసాధారణం. అవి ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తాయి. కనుక ఈ సీజన్ లో పాములు ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తూ ఉండాలని చెబుతారు. ముఖ్యంగా వర్షం కారణంగా పాములు బూట్లలోకి ప్రవేశించి దాక్కుని ఉన్న వార్తలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. బూట్లలో దాగిన పాముని గుర్తించకుండా బూట్లు ధరించడానికి ప్రయత్నిస్తే, పాము కాటేస్తుంది. అందుకే వర్షాకాలంలో బూట్లు చూసిన తర్వాతే ధరించాలని చెబుతారు. ఇలాంటి ఒక కేసు బెంగళూరులో చర్చనీయాంశమైంది. శనివారం బెంగళూరులో 41 ఏళ్ల వ్యక్తి తన బూటులో దాగి ఉన్న పాము కాటు వేయడం వలన మరణించాడు.

మృతుడిని బన్నేర్‌ఘట్టలోని రంగనాథ్ లేఅవుట్ నివాసి మంజు ప్రకాష్‌గా గుర్తించారు. అతను TCSలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మీడియా నివేదికల ప్రకారం.. అతను గతంలో ఒక ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతని కాలు తిమ్మిరిగా ఉంటుంది. ఈ తిమ్మిరి కారణంగా.. అతనికి పాము కాటు వేసినప్పుడు నొప్పి తెలియక పోయి ఉండకపోవచ్చు, దీని కారణంగా అతను వైద్య సహాయం తీసుకోలేదు.. తరువాత మరణించాడు.

ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి నివేదికల ప్రకారం మంజు ప్రకాష్‌ మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో చెరకు రసం దుకాణం నుంచి క్రోక్స్ ధరించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అతను గది బయట తన క్రోక్స్‌ను తీసి.. లోపలకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో.. అతని క్రోక్స్ దగ్గర చనిపోయిన పాము ఉన్నట్లు కుటుంబ సభ్యులకి తెలిసింది]. దీంతో వారికి మంజు ప్రకాష్‌ని పాము కాటు వేసినట్లు గుర్తించారు. వెంటనే అతని గదికి గదికి పరిగెత్తారు. అక్కడ మంచం మీద పడుకుని ఉన్న అతని నోటి నుంచి నురుగు , అతని కాలు నుండి రక్తం కారుతున్నట్లు చూశారు. వెంటనే అతన్ని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ప్రాణాలు కోల్పోయిన పాము మృతుడి సోదరుడు మాట్లాడుతూ, ‘ప్రకాష్ ఇంటికి తిరిగి వచ్చి.. విశ్రాంతి తీసుకోవడానికి నేరుగా తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు. దాదాపు గంట తర్వాత మా ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి తన క్రోక్స్ బూట్ల దగ్గర ఒక పామును చూశాడు. మేము దగ్గరగా వెళ్లి చూడగా.. ఆ పాము చనిపోయింది అని చెప్పాడు.

క్రోక్స్ లోపల ఒక పాము మంజు ప్రకాష్ 2016 లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డాడని.. అప్పుడు అతని కాలికి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి అతని కాలులోని పాదం తిమ్మిరితో ఉంటుంది. ఎటువంటి అనుభూతి చెందడంలేదు. పాము బహుశా క్రోక్స్ లోపల చిక్కుకుని ఉండవచ్చు .. ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..