- Telugu News Photo Gallery Spiritual photos Pitru Paksha 2025: Benefits of worshipping Peepal Tree during Pitra Paksh Dharma
Pitru Paksha 2025: పితృ పక్షంలో రావి చెట్టుని ఎందుకు, ఎలా పూజిస్తారు? ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21న ముగుస్తుంది. ఈ 16 రోజుల సమయం పూర్వీకులకు అంకితం చేయబడింది. అలాగే ఈ సమయంలో రావి చెట్టును పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రద్ధ కర్మలను చేసే ఈ సమయాన్ని పితృ పక్ష అని అంటారు. ఈ సమయంలో రావి చెట్టును పూజించడంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Sep 01, 2025 | 11:05 AM

పితృ పక్షం సమయంలో రావి చెట్టుని పూజించడం అత్యంత శుభ ప్రదమని నమ్మకం. అందుకనే ఈ సమయంలో రావి చెట్టు పూజ కూడా ప్రారంభమవుతుంది. పితృ పక్షంలో రావి చెట్టును ఎందుకు పూజిస్తారో అనే ప్రశ్న తరచుగా కలుగుతుంటే.. ఇలా రావి చెట్టుకు పూజ చేయడానికి కారణం ఏమిటో తెలియజేద్దాం.

పితృ పక్ష సమయంలో రావి చెట్టును పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం పూర్వీకులు రావి చెట్టులో నివసిస్తారు. కనుక పితృ పక్ష సమయంలో రావి చెట్టును పూజిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృ పక్షంలో రావి చెట్టును పూజించడం వల్ల పితృ దోషం తొలగిపోయి పూర్వీకులు మోక్షం పొందుతారు. అలాగే పితృ పక్షంలో రావి చెట్టుకు నీరు అర్పించడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు వస్తుంది. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి.

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు రావి చెట్టులో నివసిస్తారని మత విశ్వాసం. పితృ పక్ష సమయంలో రావి చెట్టును పూజించడమే కాదు పితృ పక్ష సమయంలో రావి చెట్టును నాటడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన పితృ దోషం తోలుగుతుందని విశ్వాసం.

పితృ పక్షంలో రావి చెట్టును పూజించడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు. వారు మోక్షాన్ని పొందుతారు. ఇది పూర్వీకుల ఆత్మలకు శాంతిని అందించడానికి , కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు నెలకొనేందుకు ఒక మంచి పరిహారంగా పరిగణించబడుతుంది.

పితృ పక్షంలో రావి చెట్టును పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. పితృ దోషం తొలగిపోతుంది. పూర్వీకుల ఆశీస్సులు నిలిచి ఉంటాయి. కుటుంబంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయి. దీనితో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

రావి చెట్టును పూజించడానికి మొదటి నియమం ఏమిటంటే సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించింది.. పువ్వులతో పూజ చేయాలి. దీపం వెలిగించాలి. సాయంత్రం వేళల్లో అంటే సూర్యాస్తమయం తర్వాత ఆదివారాల్లో రావి చెట్టును ఈ పితృ పక్షంలో పూజించకూడదు.




