వెంకటేష్ సినిమా కారణంగానే నటనకు పుల్‌స్టాప్! షాకింగ్ కామెంట్ చేసిన సింగర్
తెలుగు సినీ పరిశ్రమలో పాప్ సింగర్‌గా ఒక ట్రెండ్‌ను సృష్టించిన ఒక ప్రముఖ గాయని.. నటిగా మారేందుకు ప్రయత్నించి విఫలమైన అనుభవాన్ని తాజాగా పంచుకుంది. 2000ల్లో 'మసక మసక చీకటిలో' అనే ఆల్బమ్ సాంగ్‌తో యువతలో సెన్సేషన్ సృష్టించిన ఆ గాయని స్మిత ..

తెలుగు సినీ పరిశ్రమలో పాప్ సింగర్‌గా ఒక ట్రెండ్‌ను సృష్టించిన ప్రముఖ గాయని.. నటిగా మారేందుకు ప్రయత్నించి విఫలమైన అనుభవాన్ని తాజాగా పంచుకుంది. 2000ల్లో ‘మసక మసక చీకటిలో’ అనే ఆల్బమ్ సాంగ్‌తో యువతలో సెన్సేషన్ సృష్టించిన ఆ గాయని స్మిత. పాటలతో విజయాల శిఖరాన్ని చేరుకున్న స్మిత.. ఒక దశలో నటనపై ఆసక్తి చూపినప్పటికీ, కేవలం ఒకే ఒక సినిమా అనుభవం కారణంగా తన నటనా వృత్తికి ఫుల్ స్టాప్ పెట్టింది.
తాజాగా స్మిత తన కొత్త పాట ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నటిగా ఎందుకు సినిమాలు చేయడం మానేసిందో వివరించింది. “గాయనిగా నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వెంకటేశ్ ‘మల్లీశ్వరి’ సినిమాలో ఒక పాత్రలో నటించాను. అది మిస్ ఫైర్ అయింది. మాకు చెప్పేది ఒకటి, అక్కడ ఉండేది ఒకటి. అందుకే ఎందుకులే అని అప్పటినుంచి సినిమాలు చేయడం మానేశాను” అని స్మిత తన అనుభవాన్ని వెల్లడించింది.
సినిమా రంగంలో తమకు చెప్పిన పాత్రకు తెరపై కనబడే పాత్రకు తేడా ఉండటం అనేది సాధారణంగా చాలామంది నటీనటులు ఎదుర్కొనే సమస్య. స్టార్ స్టేటస్ ఉన్న స్మితకు కూడా అలాంటి అనుభవమే ఎదురవడంతో, ఆమె పూర్తి దృష్టిని సంగీతంపైనే నిలపాలని నిర్ణయించుకుంది. స్మిత పాప్ సింగర్‌గా మాత్రమే కాక, నటిగా, యాంకర్‌గా, బిజినెస్‌ఉమన్‌గా కూడా పేరు తెచ్చుకుంది. తనలోని గాయనిని అభిమానులు కోరుకుంటున్నారని గ్రహించిన స్మిత.. తాజాగా తన పాత హిట్ సాంగ్ ‘మసక మసక’ను కొత్త వెర్షన్‌లో అందించేందుకు సిద్ధమైంది. నటనకు దూరమైనప్పటికీ, సంగీత ప్రపంచంలో తన స్థానాన్ని తిరిగి పదిలం చేసుకునే పనిలో స్మిత నిమగ్నమై ఉంది.

Singer Smitha
స్మిత పాడిన “మసక మసక చీకటిలో” పాట ఆమె కెరీర్‌లో అత్యంత పాపులర్ పాప్ ఆల్బమ్ సింగర్‌గా గుర్తింపు పొందింది. – దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి ఆమె రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ 2000లో విడుదలైంది. అయితే, తాజాగా ఆమె మరోసారి సరికొత్త ప్రయోగం చేశారు. ఇప్పటి యూత్‌కు నచ్చేలా అదే సాంగ్‌కు ర్యాప్ జోడించి క్రియేట్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్‌తో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. “మసక మసక చీకటిలో” పాట తెలుగు పాప్ సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చింది. తాజాగా విడుదలైన కొత్త వర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.




