హీరో, విలన్‌గా కాదు!.. చిరంజీవి, మోహన్‌బాబు అన్నదమ్ములుగా నటించిన సినిమా ఏదో తెలుసా?
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది వారి మధ్య నడిచిన కోల్డ్ వార్, బహిరంగ వివాదాలే. ఇద్దరూ 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, తమ తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ ..

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది వారి మధ్య నడిచిన కోల్డ్ వార్, బహిరంగ వివాదాలే. ఇద్దరూ 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, తమ తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో పోటీ తారాస్థాయికి చేరి, పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. వజ్రోత్సవాల సమయంలో వీరి మధ్య జరిగిన వాగ్వాదం.. ఆ తర్వాత ‘మా’ ఎన్నికల వరకు ఆ ప్రభావం కొనసాగింది.
అయితే, ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారు. అంతేకాదు, కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు కూడా! వాటిలో చాలా వరకు చిరంజీవి హీరోగా, మోహన్ బాబు విలన్‌గా నటించారు. కానీ, వీరు ఇద్దరూ కలిసి అన్నదమ్ములుగా నటించిన సినిమా ఒకటి ఉంది. ఆ అరుదైన చిత్రమేమిటో, దాని విశేషాలేంటో చూద్దాం.
‘పట్నం వచ్చిన పతివ్రతలు’!
చిరంజీవి, మోహన్ బాబు కలిసి అన్నదమ్ములుగా నటించిన ఆ ఏకైక సినిమా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’. ఈ సినిమా 1982లో విడుదలైంది. ఇందులో మోహన్ బాబు అన్నగా, చిరంజీవి తమ్ముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇది ‘పట్టణక్కె బంద పత్నియరు’ అనే కన్నడ సినిమాకు తెలుగు రీమేక్. మౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా, కామెడీ ప్రధానంగా సాగింది.

Patnam Vachina Pativrathalu1
చిరంజీవి జోడీగా రాధిక, మోహన్ బాబు జోడీగా గీత నటించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇద్దరు అగ్ర నటుల కెరీర్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్‌ను ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 80, 90వ దశకంలో చిరంజీవి వరుస విజయాలతో టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆయన దూకుడును ఆపడం ఎవరి వల్లా కాలేదు. సరిగ్గా అదే సమయంలో మోహన్ బాబు ఒకే ఒక్క సినిమాతో చిరంజీవికి గట్టి పోటీనిచ్చారు.
చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’ (1995) సినిమాతో పోటీగా మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ సినిమా విడుదలైంది. ‘బిగ్ బాస్’ ప్లాప్ టాక్ తెచ్చుకోగా, ‘పెదరాయుడు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇది వీరిద్దరి కెరీర్‌లో ఉత్కంఠ రేపిన అతిపెద్ద పోరుగా మిగిలిపోయింది. ఏది ఏమైనా, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరికొకరు పోటీగా నిలిచే ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకప్పుడు అన్నదమ్ములుగా కలిసి నటించిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా వారి పాత స్నేహ బంధానికి ఒక గుర్తుగా నిలిచింది.




