Box Office 2025: రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు.. టాలీవుడ్ లిస్ట్‌లో ఉన్నవి ఎన్ని?
2025 సంవత్సరం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక మైలురాయిగా నిలిచింది. కరోనా అనంతర పరిస్థితుల నుంచి కోలుకుని, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఈ ఏడాది అనేక చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యాయి. ముఖ్యంగా, రూ.300 కోట్ల గ్రాస్ ..

2025 సంవత్సరం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక మైలురాయిగా నిలిచింది. కరోనా అనంతర పరిస్థితుల నుంచి కోలుకుని, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఈ ఏడాది అనేక చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యాయి. ముఖ్యంగా, రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్ లో ఏకంగా 8 సినిమాలు చేరి, భారతీయ సినిమా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాయి. అయితే, ఈ ఘనతలో సౌత్, బాలీవుడ్ చిత్రాలు పోటీపడినప్పటికీ, ఇందులో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేకపోవడం సినీ అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది! 8 సినిమాలు.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్ దాటి 8 సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన హిందీ చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న నటించిన ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కేవలం 7 రోజుల్లోనే రూ.807.91 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీని తర్వాత స్థానంలో కన్నడ నుంచి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 ఉంది, ఇది 4 రోజుల్లోనే రూ.852.21 కోట్లను దాటింది. మరో ముఖ్యమైన చిత్రం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కేవలం 3 రోజుల్లోనే రూ.300 కోట్ల మార్కును దాటి,...




